Bank Holidays October 2021: అక్టోబర్ నెలలో బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించే ముందు, బ్యాంకులు మూసివేయబడే ముఖ్యమైన రోజుల జాబితా గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే అక్టోబర్ నెలలో దాదాపు 21 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (The Reserve Bank of India) అక్టోబర్ 2021 నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు మూసివేయబడే కొన్ని రోజులను వెల్లడించింది అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు పని చేస్తూనే ఉంటాయని కూడా తెలిపింది.
Also Read: Elephant Attack on Bus: గజరాజు ఆగ్రహం... బస్సుపై దాడి.. తరువాతేం ఏం జరిగింది..??
వచ్చే నెల అక్టోబర్ లో బ్యాంకులు 21 రోజులు పాటు మూసివేయబడతాయి- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ జాబితా ప్రకారం, కొన్ని సెలవులు కాగా వారిలో మరికొన్ని రోజులు వారాంతాలు (Week Ends). అయితే వివిధ రాష్ట్రాల్లో వాటి నిర్వహాణ నియమ నిబంధనలను బట్టి బ్యాంకింగ్ కార్యకలాపాలు మారవచ్చు అని కూడా తెలిపింది.
ఏదేమైనా, వివిధ రాష్ట్రాలలో బ్యాంకు సెలవులు మారుతూ ఉంటాయని , అన్ని బ్యాంకింగ్ కంపెనీలు వీటిని దృష్టిలో ఉంచుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించింది. అంతేకాకుండా, బ్యాంక్ సెలవులు వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగ తేదీలు మరియు ఆయా రాష్ట్రాలలో విడుదల చేసే నోటిఫికేషన్‌పై ఆధారపడి ఉంటాయని తెలిపింది
అక్టోబర్ 2021 నెలలో వచ్చే బ్యాంకు సెలవుల యొక్క విస్తృత జాబితాను చూడండి....
Also Read: Female Man: 16 ఏళ్ల యువతికి గడ్డం-మీసాలు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ
అక్టోబర్ 2021లో ఉన్న బ్యాంక్ సెలవుల జాబితా:
అక్టోబర్ 1 - బ్యాంకు ఖాతాల సగం వార్షిక ముగింపు (సిక్కిం)
అక్టోబర్ 2 - గాంధీ జయంతి (దేశం మొత్తం)
అక్టోబర్ 3 - ఆదివారం
అక్టోబర్ 6 - మహాలయ అమావాస్యే (పశ్చిమ బెంగాల్, త్రిపుర, కర్ణాటక)
అక్టోబర్ 7 - లైనింగ్‌థౌ సనమహి మేరా చౌరెన్ హౌబా (త్రిపుర, పశ్చిమ బెంగాల్, మేఘాలయ)
అక్టోబర్ 9 - 2 వ శనివారం
అక్టోబర్ 10 - ఆదివారం
అక్టోబర్ 12 - దుర్గా పూజ (మహా సప్తమి) / (పశ్చిమ బెంగాల్, త్రిపుర)
అక్టోబర్ 13 - దుర్గా పూజ (మహా అష్టమి) / (పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, మణిపూర్, త్రిపుర, అస్సాం)
అక్టోబర్ 14 - దుర్గా పూజ / దసరా (మహా నవమి) / ఆయుధ పూజ (పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, తమిళనాడు, సిక్కిం, పుదుచ్చేరి, ఒడిషా, నాగాలాండ్, మేఘాలయ, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, బీహార్, అసోం)
అక్టోబర్ 15 - దుర్గా పూజ / దసరా / దసరా (విజయ దశమి) / (మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ జాతీయ అంగీకారం)
అక్టోబర్ 16 - దుర్గా పూజ (దాసింగ్) / (సిక్కిం)
అక్టోబర్ 17 - ఆదివారం
అక్టోబర్ 18 - కాటి బిహు (అస్సాం)
Also Read: Posani Krishna Murali: 'పవన్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు పెడుతున్నారు'..
అక్టోబర్ 19 - Id-E-Milad / Eid-e-Miladunnabi / Milad-i-Sherif (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) / బరవఫత్ (గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్)
అక్టోబర్ 20 - మహర్షి వాల్మీకి పుట్టినరోజు/లక్ష్మీ పూజ/ఐడి-ఇ-మిలాద్ (త్రిపుర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, హర్యానా, హిమాచల్ ప్రదేశ్)
అక్టోబర్ 22 - శుక్రవారం ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ కాశ్మీర్)
అక్టోబర్ 23 - 4 వ శనివారం
అక్టోబర్ 24 - ఆదివారం
పైన పేర్కొన్న బ్యాంక్ సెలవులు ఆయా ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవుల ప్రకారం పాటించబడతాయి, అయితే ప్రకటన చేయబడ్డ సెలవుల రోజులలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఇలా బ్యాంకు సెలవుల పట్ల అవగాహనా కలిగి ఉంటే మీ బ్యాంకు లావాదేవీలను మెరుగైన మార్గంలో ప్రణాళిక చేసుకోవచ్చు. ఎక్కువ రోజుల పాటు సెలవులు ఉండే వారంతంలో కూడా చక్కగా ప్రణాళిక చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook