'సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదా ఇండియన్ సర్టిఫికేట్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు మదర్సలాలు అనుబంధంగా ఉండాలి' అని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఛైర్‌పర్సన్ వసీం రిజ్వి ఏఎన్ఐకి తెలిపారు. మత విద్యను ఐచ్ఛికంగా తయారు చేయాలని రిజ్వి సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఈ విషయం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌లకు నేను లేఖ రాశాను' అని రిజ్వీ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. షియా సెంట్రల్ వక్ఫ్ మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది వక్ఫ్ పాలక, పరిపాలనలను పర్యవేక్షిస్తుంది.