Madras High Court: ఇన్‌కంటాక్స్ స్లాబ్‌పై వివాదం, కేంద్రానికి మధురై బెంచ్ నోటీసులు
Madras High Court: మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ మరోసారి సంచలనం రేపింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన వ్యవహారంపై కేంద్రానికి నోటీసులు పంపింది. మధురై బెంచ్‌లో దాఖలైన ఆ పిటీషన్ కూడా ఇప్పుడు చర్చనీయాంమౌతోంది.
మద్రాస్ హైకోర్టు నుంచి ఇప్పటికే పలు సంచలన తీర్పులు వెలువడిన పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇన్‌కంటాక్స్ వ్యవహారమై దాఖలైన ఓ పిటీషన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు గానీ పిటీషన్ వేసిన ప్రశ్న ఆలోచింపజేస్తోంది. ఈ వ్యవహారంలో మధురై బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది.
కేంద్ర ఫైనాన్స్ చట్టం 2022 ప్రకారం ఏడాది ఆదాయం 2.5 లక్షలు దాటితే ఇన్‌కంటాక్స్ చెల్లించాలనేది నియమం. ఈ నియమంపై డిక్లరేషన్ కోరుతూ మదురై బెంచ్‌లో కున్నూర్ శీనివాస్ ఓ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన మధురై బెంచ్..కేంద్ర ప్రభుత్వానికి ఈ నోటీసులు పంపించింది.
ఇన్‌కంటాక్స్ ట్యాక్స్ స్లాబ్ సమంజసమేనా
డీఎంకే పార్టీకు చెందిన ఎస్సెట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న విరూధునగర్‌కు చెందిన కున్నూర్ శీనివాస్ దాఖలు చేసిన పిటీషన్ ఇది. ఫైనాన్స్ చట్టం 2022 తొలి షెడ్యూల్ పార్ట్ 1లోని పారాగ్రాఫ్ ఎ ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధించిన ట్యాక్స్ స్లాబ్ అనేది రాజ్యాంగంలోని 14, 15, 16, 21,265 ఆర్టికల్స్‌కు విరుద్ధమని పిటీషనర్ పేర్కొన్నాడు.
ఈడబ్ల్యూఎస్ విషయంలో కేంద్రం చెబుతున్నదేంటి
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించేందుకు కుటుంబ ఆదాయం 7,99,999 రూపాయలవరకూ ఉండాలని..కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట ఆదాయాన్ని నిర్ధారించింది. అదే సమయంలో ఏడాది ఆదాయం 7,99,999 రూపాయలవరకూ ఉన్నప్పుడు ఆ వ్యక్తుల నుంచి ప్రభుత్వం ఇన్‌కంటాక్స్ వసూలు చేయకూడదని ఉంది.
అందరికీ ఒకే నిబంధన ఉండాలి కదా
నిర్ధిష్ట ఆదాయం ద్వారా ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కొంతమందిని లేదా ఓ వర్గాన్ని ఆర్ధికంగా బలహీనమైన వర్గంగా విభజించినప్పుడు..ఇతర వర్గాల ప్రజలకు కూడా అదే ఆదాయ పరిమితి వర్తించాలని పిటీషనర్ తెలిపాడు. మధురై బెంచ్‌కు చెంది జస్టిస్ ఆర్ మహాదేవన్, జే సత్యనారాయణ ప్రసాద్‌లు కేంద్ర ఆర్ధిక శాఖ, న్యాయశాఖలకు నోటీసులు పంపి..కేసును రెండువారాలకు వాయిదా వేశారు.
Also read: 7th Pay Commission Update: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి పెండింగ్ డీఏ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook