Maharashtra Elections: తెలంగాణలో ఇచ్చిన హామీలనే కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి మహారాష్ట్రలో అవే హామీలను ఇచ్చింది. ఉచిత బస్సుతోపాటు ఇక్కడ మహిళలకు రూ.2,500 అంటే అక్కడ మాత్రం రూ.3 వేలు అని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడి మహా వికాస్‌ అఘాడీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణలో హామీలు చేయని కాంగ్రెస్‌ మహారాష్ట్రంలో అమలు చేస్తుందా? అనే చర్చ మొదలైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ ముంబైలో పర్యటించారు. మహా వికాస్‌ అఘాడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ మరాఠా ప్రజలకు భారీ హామీలు కురిపించారు. మహిళందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు నెలనెలా రూ.3 వేల ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రతినిధులు ప్రకటించారు. కిసాన్‌ సమృద్ధి యోజన కింద రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తామని కూటమి ప్రతినిధులు మాట ఇచ్చారు.

Also Read: Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదా


ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. 'సీబీఐ, ఈడీ, ఐటీలను ఉపయోగించి ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కూల్చేస్తోంది. మహారాష్ట్రంలో గతంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని ఇలాగే చేసింది' అని గుర్తుచేశారు. దేశంలో కుల గణన చేస్తున్నట్లు తెలంగాణను ఉదాహరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పరిపాలిస్తున్న బీజేపీ నేతృత్వంలోనే ఏక్‌నాత్‌ షిండే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరలేదని.. ముంబైలో దారుణ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. కాగా మహా వికాస్‌ అఘాడీ కూటమిలో కాంగ్రెస్‌ పార్టీ, శివసేన ఉద్దవ్‌ ఠాక్రే విభాగం, ఎన్‌సీపీలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పడగా.. ఏక్‌నాథ్ షిండే ద్వారా ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. నాటి కసిన్నంతా తీర్చుకునేందుకు మహా వికాస్‌ అఘాడీ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.