Maharashtra political crisis : మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు? ఎన్నికల్లో తేల్చుకుంటామంటున్న ఉద్దవ్ థాకరే..
Maharashtra political crisis : మహా రాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ రద్దు దిశగా వెళుతోంది. అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం ఉద్దవ్ థాకరే ఉన్నారని తెలుస్తోంది.
Maharashtra political crisis : మహా రాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ రద్దు దిశగా వెళుతోంది. అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం ఉద్దవ్ థాకరే ఉన్నారని తెలుస్తోంది. కాసేపట్లో మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేయాలని తీర్మానం చేసి గవర్నర్ కు పంపించనున్నారు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే. సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సంచలన ట్వీట్ చేశారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రెండో రోజుల నుంచి గంటగంటకూ మారిపోయింది. శివసేనకు చెందిన సీనియర్ మంత్రి ఏక్ నాథ్ షిండే ఉద్దవ్ థాకరేపై తిరుగుబాటు చేశారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన క్యాంప్ కు వెళ్లారు. ఏక్ నాథ్ షిండే తో 13 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని మొదట ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు 34 మంది ఎమ్మెల్యేలు షిండే క్యాంపులో ఉన్నారని తెలుస్తోంది. అందులో నలుగురు మంత్రులు ఉన్నారని చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో సగానికి పైగా ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేతో ఉండటంతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. షిండే వర్గం ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది.
తిరుగుబాటు నేత షిండేతో చర్చలకు ఉద్దవ్ థాకరే ప్రయత్నించినా సఫలం కాలేదని అంటున్నారు. దీంతో చేసేది లేక ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం ఉద్దవ్ థాకరే నిర్ణయించారని తెలుస్తోంది. మధ్యాహ్నం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేసి గవర్నర్ కు పంపిస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తామని పార్టీ నేతలకు ఉద్దవ్ సంకేతం ఇచ్చారని అంటున్నారు. అసెంబ్లీ రద్దుపై మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతోనూ ఉద్దవ్ థాకరే చర్చించారు. వాళ్లు కూడా ఆమోదం తెలపడంతో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా వికాస్ అగాధి కూటమికి 169 ఎమ్మెల్యేల బలం ఉంది. శివసేన 56, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44 మంది సభ్యులున్నారు. ఇతర చిన్న పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 8మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉద్దవ్ థాకర్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 113 మంది సభ్యుులన్నారు.106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా.. ఆర్ఎస్పీ 1, జేఎస్ఎస్ 1, ఐదుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఎంఐఎంకు ఇద్దరు, సీపీఐ, ఎంఎన్ఎస్, స్వాభిమాన్ పక్ష్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు.
Read also: AP Inter Results 2022: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Read also: Vijayakanth Toes: సీనియర్ హీరో విజయకాంత్‌కు అనారోగ్యం.. మూడు వేళ్ల తొలగింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook