Bomb blast Threat To Ayodha Temple:  అయోధ్య రామమందిరంలో రామ్ లల్లాకు వేడుకగా పూజలు జరుగుతున్నాయి. వందల ఏళ్ల తర్వాత.. భవ్య రామమందిరం ప్రతిష్టాపన వేడుక సాకారం అయ్యింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అతిరథ మహరథులు, సామాన్యులు అని తేడాలేకుండా చాలా మంది రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చారు. ఇప్పటికి కూడా ప్రతిరోజు వేలాదిగా వచ్చి అయోధ్య రామమందిరంను దర్శించుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Bigg Boss Rathika: బిగ్ బాస్ రతిక అందాల అరాచకం.. చూసి తట్టుకోగలరా..


రామ్ లల్లాకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీ ఎత్తున తమ కానులను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా వచ్చి మతసామారస్యం వెల్లివిరిసేలా రామ్ లల్లాను దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా రామమందిరంపై దాడి చేస్తున్నట్లు ఒక బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.


వెంటనే సెక్యురిటీని అప్రమత్తం చేశారు.  ముంబై పోలీసులకు సోహమ్ పాండే అనే వ్యక్తి నుండి కాల్ వచ్చింది. అతను 'రామ మందిరంపై దాడి' కి ఎవరో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు.   ఉత్తరప్రదేశ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎముకలు కొరికే చలి ఉన్నప్పటికీ, భక్తులు ధార్మిక క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. రద్దీని పోలీసులు అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నారు. 


రామమందిరంపై దాడి?


ముందే చెప్పినట్లుగా, ముంబయి పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది, 'రామ మందిరంపై దాడి' జరగవచ్చని హెచ్చరించాడు. తనను తాను సోహం పాండేగా గుర్తించిన కాల్ చేసిన వ్యక్తి, తన స్నేహితులలో ఒకరైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది అయిన నంద్కిషోర్ సింగ్ రైలులో ఆగ్రా నుండి ముంబైకి ప్రయాణిస్తున్నాడని, ఎవరో ప్లాన్ చేయడం గురించి మాట్లాడటం విన్నాడని ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. 


ముంబై పోలీసులు బెదిరింపు కాల్‌పై చర్యలు..


ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామమందిరంపై దాడికి ప్రణాళికలున్నాయని ఆగ్రాలోని అద్పత్‌పూర్ నివాసి ఖురేషీ చెప్పడం అతని స్నేహితుడు నందకిషోర్ పాండే విన్నాడని సోహమ్ పాండే ముంబై పోలీసులకు తెలిపాడు. సరైన విచారణ కోసం కాలర్ ఖురేషీ,  నందకిషోర్ సింగ్ ఇద్దరి మొబైల్ నంబర్లను కూడా సేకరించారు.


Read More: Menthulu Water For Weight Loss: 5 రోజుల్లో మెంతుల నీటితో బరువు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎలా?


ఆతర్వాత.. ముంబై పోలీసులు ప్రొటొకాల్ ప్రకారం..  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంబంధిత భద్రతా ఏజెన్సీలు,  వారి సహచరులకు సమాచారం అందించారని చెప్పారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సంచలనంగా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook