Aadhaar Card Photo Mistake: 8 ఏళ్ల బాలుడి ఆధార్ కార్డులో డిప్యూటీ సీఎం ఫొటో! నెట్టింట్లో వైరల్
Deputy CM Photo on 8 year old boy Aadhar Card: మహారాష్ట్రంలో ఓ బాలుడి ఆధార్ కార్డుపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో ఉంది. ఏడేళ్ల క్రితం జారీ చేసిన ఈ ఆధార్ కార్డుతోనే బాలుడికి అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలతో పాటు పాఠశాలలో అడ్మిషన్ కూడా లభించింది.
Maharashtra Deputy CM Devendra Fadnavis Photo pasted in 8 Year Old boy Aadhaar Card: ఆధార్ కార్డులో తప్పులు నమోదు చేయడం సహజం. పేరు, పుట్టినతేదీ, అడ్రస్ వంటి వాటిలో చిన్న చిన్న తప్పులు మనం చూస్తునే ఉంటాం. ఫొటోలు మారిపోవడం చాలా అరుదు కానీ.. ఎక్కడో ఒకటి జరుగుతుంటాయి. మహారాష్ట్రలో ఆధార్ కార్డులో ఓ బాలుడి ఫొటో స్థానంలో ఏకంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు అదే ఆధార్ కార్డుతో బాలుడికి స్కూల్‌లో అడ్మిషన్ కూడా ఇచ్చారు. చంద్రాపూర్ జిల్లా చిమూర్ గ్రామీణ ప్రాంతంలో ఈ విషయం తెరపైకి వచ్చింది. ఏడేళ్ల క్రితం బాలుడికి తల్లి ఆధార్ కార్డు తీయించగా.. అప్పటి సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటోతో ఆధార్ కార్డును ఇంటికి పంపించారు. తన కుమారుడు ఫొటోను ఆధార్‌లో నమోదు చేయించేందుకు తల్లి ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలించలేదు.
సిందేవాహి తాలూకా విర్వా గ్రామంలో ఉండే జిగల్ జీవన్ సవాసకడే (8) అనే బాలుడు ఆధార్ కార్డుపై అతని ఫొటోకు బదులు ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో ఉంది. ఏడేళ్ల క్రితం శంకర్‌పూర్‌లో ఆధార్‌కార్డు నమోదు కేంద్రంలో బాలుడి తల్లి ఆధార్ కార్డు వివరాలు ఎంట్రీ చేయించింది. ఒరిజినల్ ఆధార్ కార్డు ఇంటికి చేరిన తరువాత చూసి అందరూ షాక్ అయ్యారు. తమ కుమారుడి స్థానంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో చూసి ఆశ్చర్యపోయారు. ఫొటో తప్ప మిగిలిన వివరాలు అన్ని కరెక్ట్‌గా ఉన్నాయి.
Also Read: TS PECET 2023 Results: రేపు టీఎస్‌పీఈ సెట్-2023 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!
దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో ప్లేస్‌లో తన కుమారుడి ఫొటోను యాడ్ చేయించేందుకు బాలుడి తల్లి ఆధార్ కేంద్రాలను సందర్శించింది. అయితే ఫొటో మార్చేందుకు బాలుడికి ఐదేళ్లు నిండాలని నిర్వాహకులు చెప్పారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ పథకానికి, పాఠశాలలో అడ్మిషన్‌కు ఆధార్ కార్డు తప్పనిసరి. ఫొటో మినహా వివరాలు అన్ని కరెక్ట్‌గా ఉండడంతో ఇదే ఆధార్ కార్డును బాలుడు తల్లి అన్ని చోట్లా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డుపై ముద్రించిన ఫోటోను వీలైనంత త్వరగా మార్చాలని అధికారులను చీమూరు తహసీల్దార్ ఆదేశించారు.
ప్రస్తుతం ఆధార్ కార్డులో దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో మార్పు ప్రక్రియ జరుగుతోంది. ఆధార్‌లో ఫొటో మార్చుకోవడానికి ఏడేళ్లు తిరగాల్సి వచ్చిందని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలుడి ఆధార్ కార్డుపై పొరబాటున ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో వచ్చిందని శంకర్‌పూర్ పట్వారీ శంకర్ గుజేవార్ తెలిపారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆధార్ కార్డులో ఫొటోను మార్చినట్లు చెప్పారు.
Also Read: Nora Fatehi: అందాల బాంబ్ పేల్చిన నోరా ఫతేహి.. హాట్ ట్రీట్ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి