TS PECET 2023 Results: రేపు టీఎస్‌పీఈ సెట్-2023 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!

TS PECET 2023 Results will Be Released on  https://pecet.tsche.ac.in/ : టీఎస్‌పీఈ సెట్-2023 ఫలితాలపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఫలితాల కోసం https://pecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 23, 2023, 09:39 PM IST
TS PECET 2023 Results: రేపు టీఎస్‌పీఈ సెట్-2023 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!

TS PECET 2023 Results will Be Released on  https://pecet.tsche.ac.in/ : టీఎస్‌పీఈ సెట్-2023 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, శాతవాహన వర్సిటీ వీసీ మల్లేశ్ రిలీజ్ చేయనున్నారు. అభ్యర్థులు https://pecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని బీపెడ్, డీపెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌   (పీఈసెట్)ను నిర్వహించారు. 

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు..

==> అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌  https://pecet.tsche.ac.in/ లోకి వెళ్లండి.
==> ఇక్కడ TS PECET-2023 Results అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. 
==> మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లేపై ప్రత్యక్షం అవుతుంది.
==> భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ లేదా పీడీఎఫ్‌ ఫైల్ డౌన్‌లోడ్ చేసి ఉంచుకోండి
==> అడ్మిషన్ ప్రక్రియలో ఈ ర్యాంక్ కార్డు తప్పకుండా అవసరం అవుతుంది. 

మరోవైపు పేపర్ లీక్ ఘటన తరువాత రద్దు అయిన పరీక్షల విషయంలో టీఎస్‌పీఎస్‌సీ వేగం పెంచింది. మళ్లీ నిర్వహించనున్న పలు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంతో కీలకమైన గ్రూప్-1 ఎగ్జామ్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించింది. అతి త్వరలోనే ప్రైమరీ కీను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కీ విడుదల తరువాత.. తుది ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా గ్రూప్-1 మెయిన్ ఎగ్జామ్స్‌ తేదీలపై కూడా దృష్టిపెట్టనుంది. పేపర్ లీక్ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో.. అన్ని పరీక్షలను అధికారులు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న పొరబాటు జరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి   

Also Read: విండీస్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. సీనియర్ ప్లేయర్‌పై వేటు.. శాంసన్, జైస్వాల్‌కు చోటు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x