Maharashtra Election Result 2024: మహారాష్ట్రలో బీజేపీ జోరు..
Maharashtra Election Result 2024: భారత దేశంలో సీట్ల పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు బీజేపీ కూటమి ముందంజలో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూడా గట్టి పోటీ ఇస్తుంది.
Maharashtra Election Result 2024: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో కూటమి మెజారిటీ 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. గత రెండు పర్యాయాలు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూటమి.. మూడోసారి మిత్రపక్షాల వెన్నుదన్నుతో కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. అయితే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టింది. మరోవైపు జమ్ము కశ్మీర్ లో ఎక్కువ ఓట్టు తెచ్చుకున్న పార్టీగా చరిత్ర తిరగరాసింది. బీజేపీ పనైపోయిందన్న వాళ్లు మూయించారు. హర్యారా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలుబడిన వెను వెంటనే మహారాష్ట్రతో పాటు, జార్ఖండ్ కు ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 13, 20న రెండు విడతల్లో జార్ఖండ్ లో పోలింగ్ జరిగింది.
మరోవైపు మహారాష్ట్రలోని 288 సీట్లకు ఈ నెల 20న ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి (ఎన్డీయే) కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా కూటమి మొత్తంగా.. మహాయుతి దాదాపు సెంచరీ మార్క్ దాటి మెజారిటీకి చేరువలో 151 సీట్లలో ఉంది. బీజేపీ 55 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు శివసేన 34 సీట్లో ముందుంజలో ఉంది. మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ 19 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ 84 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తగా కాంగ్రెస్ పార్టీ 24 సీట్లు.. శివ సేన ఉద్ధవ్.. 10.. ఎన్సీపీ .. 12 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ నేతృత్వంలో మహాయుతి అధికారంలోకి రావడం గ్యారంటీ అని చెప్పొచ్చు. మొత్తంగా 12 గంటల వరకు మొత్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలవబోతుందో క్లియర్ పిక్చర్ రానుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter