Maharashtra Election Result 2024:మహారాష్ట్రలో మ్యాజిక్ మార్క్ దాటిన బీజేపీ..
Maharashtra Election Result 2024: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ మించి దూసుకుపోతుంది. మొత్తం 288 సీట్లలో బీజేపీ 200 పైగా సీట్లలో లీడింగ్ లో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ 60 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మొత్తంగా మెజారిటీకి అవసరమైన 145 స్థానాలకు దాటింది.
Maharashtra Election Result 2024: మహారాష్ట్ర మొత్తంగా 288 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోన మహా యుతి ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ బీజేపీ కూటమి దాదాపు 222 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు నాందేడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. ఓట్ల లెక్కింపు కోసం మహారాష్ట్ర వ్యాప్తంగా 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. వీటి పర్యవేక్షణకు ఒక్కో కేంద్రానికి ఓక్కో పరిశీలకుడిని ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే కదా. ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభమైన కౌంటింగ్ లో బీజేపీ కూటమి దూకుడు మీదుంది. మొత్తంగా మెజారిటీ స్థానాలకు కావాల్సిన 145 మార్క్ క్రాస్ చేసి 222 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లును లెక్కింపు కూడా బీజేపీ లీడ్ లో కనిపించింది. అప్పటి నుంచి అప్రతిహతంగా దూసుకుపోతుంది. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని చేయాల్సి ఉంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇరు పార్టీల అభ్యర్ధులు బరిలో నిలిచారు. అంతేకాదు కౌంటింగ్ సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సెంట్రల్ భద్రత బలగాలు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులను మోహరించారు. స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలు సీసీటీవీ నిఘాలో ఉంి. వాటి ఫుటేజీని అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచిన సంగతి తెలిసిందే కదా. ముంబయిలో 36 కౌంటింగ్ కేంద్రాలకు 300 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమిగూడడాన్ని పోలీసులు నిషేధించారు. నవంబర్ 24 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు.
మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెుత్తం 66.05 శాతం పోలింగ్ నమోదైంది. అదే రోజు నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో 67.81 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన శిందే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన-యూబీటీ 95, ఎన్సీపీ-ఎస్పీ 86 స్థానాల్లో బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోనే మహాయుతి అధికారం చేపట్టడం ఖాయం అని చెప్పాలి. మొత్తంగా అక్కడ 222 పైగా
స్థానాల్లో దూసుకుపోతుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter