Maharashtra: ఏక్‌నాథ్ షిండేకు భారీ షాక్.. తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్?
Big Shock To Eknath Shinde Next CM Likely Devendra Fadnavis: గతానికి ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వస్తుండడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేను పక్కకు నెట్టేసి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
Devendra Fadnavis: మరాఠా గడ్డపై మరోసారి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికే అధికారం దక్కింది. ఆరంభం నుంచి అధికార కూటమి దూకుడుగా కనిపించగా దాదాపుగా తుది ఫలితాలు కూడా అదే తీరున ఉండే అవకాశం ఉంది. గతానికి కన్నా సీట్లు అధికంగా రావడం కూటమికి కలిసొచ్చే అంశం. మహారాష్ట్రను మరోసారి కేంద్రంలోని బీజేపీ ఏలనుంది. ముచ్చటగా మూడోసారి అధికారం సొంతం చేసుకోవడంతో కొత్త ఉత్సాహంతో ఉన్న బీజేపీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. గతంలో అధికారం కోసం ఇతర పార్టీ వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వగా.. ఇప్పుడు ఎన్నికల్లో అఖండ విజయంతో సీఎం స్థానం కూడా తామే పొందాలని కాషాయ పార్టీ భావిస్తోంది.
ఇది చదవండి: Election Results Live: మహారాష్ట్రలో రెండోసారి మహాయుతిదే అధికారం.. జార్ఖండ్‌లో ఉత్కంఠ
మరాఠా ప్రజలు చాలా రోజుల తర్వాత స్పష్టమైన తీర్పును ఇచ్చారు. గతంలో ఏ పక్షానికి మెజార్టీ కట్టబెట్టని నేపథ్యంలో అధికారం కోసం పావులాట జరిగింది. కొందరు గద్దెనెక్కడం.. మరికొందరు గద్దె దిక్కడం.. కుట్రలు.. కుతంత్రాలతో ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు ప్రజాతీర్పు స్పష్టంగా ఉండడంతో బీజేపీ కొత్త ఉత్సాహంతో ఉంది. 2019 ఎన్నికల్లో శివసేన హ్యాండివ్వడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.
ఇది చదవండి: Election Results Live: మహారాష్ట్రలో రెండోసారి మహాయుతిదే అధికారం.. జార్ఖండ్‌లో ఉత్కంఠ
అయితే బోటాబోటి మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బీజేపీ కుప్పకూల్చింది. శివసేన పార్టీలో ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని తీసుకుని ఆ పార్టీని నిట్టనిలువునా చీల్చింది. నాడు అధికారం కాపాడుకోవడం కోసం చీలిక తీసుకువచ్చిన ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. నాడు తాత్కాలికంగా షిండేతో సర్దుబాటు చేయగా ఇప్పుడు స్పష్టమైన మెజార్టీ రావడంతో షిండేను బీజేపీ పక్కనపెట్టే యోచన ఉంది.
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అవకాశం దక్కనుందని ప్రచారం జరుగుతోంది. పూర్తి ఫలితాలు రాకముందే బీజేపీ నాయకులు అదే విషయాన్ని బహిరంగంగా మాట్లాడుతున్నారు. 'మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరిస్తారు' అని బీజేపీ నాయకుడు ప్రవీణ్ ధరేకర్ వ్యాఖ్యానించారు. ఫలితాలు సానుకూలంగా ఉండడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే ఫడ్నవీస్‌తో సమావేశం కానుండడం సంచలనంగా మారింది.
మరోసారి ముఖ్యమంత్రి యోగం దేవేంద్రకు దక్కనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2014లో గెలిచి వరుసగా ఐదేళ్లు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2019లో సీఎంగా ఎన్నికై కేవలం 11 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాస్తవంగా ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు సమయంలో ఫడ్నవీస్‌కే సీఎం పీఠం ఇవ్వాలని భావించారు. కానీ ప్రభుత్వం నిలబడేందుకు ఫడ్నవీస్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారం దక్కడంతో ఈసారి షిండేను పక్కకు నెట్టేసి దేవేంద్ర ఫడ్నవీస్ అందలం ఎక్కే అవకాశం ఉంది. దీనికి బీజేపీ అధిష్టానం సంపూర్ణ మద్దతు లభించగా.. ఏక్‌నాథ్ షిండే వర్గానికి మాత్రం మాట్లాడే అర్హత లేకపోయింది. వీటన్నిటి నేపథ్యంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టేలా పరిస్థితులు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter