Farmer Applied for Helicopter Loan: ఉన్నోళ్లే పెద్ద కలలు కనాలా.. మాలాంటి రైతులకు కూడా బిగ్ డ్రీమ్స్ ఉంటాయంటున్నాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు. భూమిని నమ్ముకుని బతికే తనలాంటి రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నాడు. బ్యాంకులు తమకు పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తే తాము కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయగలమని చెబుతున్నాడు. తాను హెలికాప్టర్ కొనుగోలు చేసి.. దాన్ని అద్దెకు తిప్పాలనుకుంటున్నానని.. ఇందుకు లోన్ కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలోని హింగోలి జిల్లా తక్టోడా గ్రామానికి చెందిన కైలాశ్ పతంగే (22) అనే యువ రైతు తనకు రూ.6 కోట్లు లోన్ ఇవ్వాలంటూ ఇటీవల బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. కైలాశ్‌కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా గడిచిన కొన్నేళ్లలో వ్యవసాయం గిట్టుబాటు కాలేదు. దీంతో వ్యవసాయాన్ని వీడి హెలికాప్టర్ కొనుక్కోవాలని డిసైడ్ అయ్యాడు. 


'గత రెండేళ్లు నేను సోయాబీన్ సాగు చేశాను. కానీ అకాల వర్షాల కారణంగా రాబడి సరిగా లేదు. పంట భీమా ద్వారా వచ్చిన డబ్బు కూడా సరిపోలేదు.అందుకే ఒక హెలికాప్టర్ కొనుక్కొని దాన్ని అద్దెకు తిప్పాలని నిర్ణయించుకున్నాను. అలా అయితే మంచి జీవనం గడపవచ్చు. పెద్దవాళ్లకే పెద్ద కలలు ఉంటాయని ఎవరు చెప్పారు.. రైతులు కూడా పెద్ద కలలు కనాలి. అందుకే హెలికాప్టర్ కొనుగోలు కోసం రూ.6.65 కోట్లు రుణం ఇవ్వాల్సిందిగా బ్యాంకుకు దరఖాస్తు పెట్టాను. ఇతర వ్యాపార రంగాల్లో చాలా పోటీ నెలకొంది. అందుకే హెలికాప్టర్ అయితేనే బెటర్ అని ఆలోచించా.' అంటూ చెప్పుకొచ్చాడు.


Also Read : Warning Call: పిస్టల్ తీసుకుని వచ్చి మీ ఇంట్లోనే కాల్చి పడేస్త.. హైదరాబాద్ VHP నేతకు బెదిరింపు కాల్  


Also Read: Rajnath Singh Review on Agnipath: అగ్నిపథ్‌పై రాజ్‌నాథ్‌ సింగ్ కీలక రివ్యూ..మరిన్ని తాయిలాలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook