Maharashtra government portfolios: మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు
ఎన్సీపీ కీలకనేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఆర్థికశాఖ, ప్రణాళిక శాఖ, శివసేన యువనేత ఆదిత్య ఠాక్రేకు పర్యావరణం, పర్యాటకం శాఖల బాధ్యతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అప్పగించారు.
ముంబై : అధికారంలోకి వచ్చిన దాదాపు నెల రోజులకు మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగాయి. ఎన్సీపీ కీలకనేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఆర్థికశాఖ, ప్రణాళిక శాఖ, శివసేన యువనేత ఆదిత్య ఠాక్రేకు పర్యావరణం, పర్యాటకం శాఖల బాధ్యతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అప్పగించారు. అంతకుముందు మంత్రులకు శాఖల కేటాయింపుల జాబితాకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఆదివారం ఉదయం (జనవరి 5) ఆమోదం తెలిపారు.
ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవితో పాటు సాధారణ పరిపాలన, ఐటీ, సమాచార ప్రజా సంబంధాలు, న్యాయ సహా మంత్రులకు కేటాయించగా మిగిలిన కొన్ని శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. కీలకమైన హోంశాఖను ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్, పట్టణాభివృద్ధిశాఖను ఏక్‌నాథ్ షిండేలకు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్‌కు రెవెన్యూశాఖ, నితిన్ రౌత్‌కు విద్యుత్‌శాఖలు లభించాయి. ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్‌కు నీటిపారుదల, ఛగన్ భుజ్‌బల్‌కు పౌరసరఫరాలు, దిలీప్ వల్సే పాటిల్‌కు ఎక్సైజ్, ధనంజ్ ముండేకు సామాజిక న్యాయశాఖల మంత్రులుగా నియమితులయ్యారు.
మాజీ ముఖ్యమంత్రికి పబ్లిక్ వర్క్స్
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్‌కు పబ్లిక్ వర్క్స్ శాఖ అప్పగించారు. ఉద్ధవ్ సన్నిహితుడు, శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయ్‌కి మైనింగ్, పరిశ్రమల శాఖ, మరాఠీ భాష శాఖలు అప్పగించారు. నవాబ్ మాలిక్ మైనార్టీ శాఖ, జయంత్ పాటిల్‌కు జలవనరులు శాఖలు దక్కాయి.
మంత్రుల శాఖలపై ఆదిత్య హర్షం
[[{"fid":"180896","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
మహారాష్ట్ర మంత్రులకు శాఖల కేటాంపులపై ఆదిత్య ఠాక్రే హర్షం వ్యక్తం చేశారు. శాఖల కేటాంపుల అనంతరం ఆయన మాట్లాడారు. తనకు పర్యావరణం, పర్యాటకం శాఖలను కేటాంచినట్లు తెలిపారు. పర్యాటకశాఖను అభివృద్ధి చేసి మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. సోమవారం (జనవరి 6) పార్టీ సమావేశం అనంతరం బాధ‍్యతలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.