Maharashtra lockdown: కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాచి పెను రక్కసిలా వచ్చి పడుతోంది. రోజురోజుకూ కరోనా ఉధృతి పెరుగుతోంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో మరో రాష్ట్రం లాక్‌డౌన్ విధించింది. దేశ రాజధాని ఢిల్లీ తరువాత లాక్‌డౌన్ విధించిన మరో రాష్ట్రం ఇప్పుడు మహారాష్ట్ర.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus )విజృంభణ ఇప్పట్లో అగేలా లేదు. కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) దేశాన్ని తీవ్రంగా వణికించేస్తోంది. మొదటి వేవ్ కంటే దారుణంగా రెండవ వేవ్ మారింది. రోజుకు రెండు లక్షల కేసుల నుంచి 3 లక్షల కేసులకు చేరుకుంది పరిస్థితి. గత 24 గంటల్లో ఏకంగా 3 లక్షలకు పైగా కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో(Night Curfew) ప్రయోజనం లేదని భావించి.. దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ (Delhi Lockdown) విధించారు. ఇప్పుడు ఢిల్లీ బాటలో మహారాష్ట్ర పయనించింది.


దేశంలోనే అత్యధికంగా కేసులున్న మహారాష్ట్ర(Maharashtra)లో పరిస్థితి ఎంతకీ అదుపులో రాకపోవడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 22 రాత్రి నుంచి మే 1వ తేదీ వరకు లాక్‌డౌన్ ( Maharashtra lockdown)‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కట్టడికి ఇక విధిలేక లాక్‌డౌన్‌ వైపు మహారాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. కరోనా కట్టడి చర్యలకు సహకరించాలని ప్రజలను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గత వారమే లాక్‌డౌన్‌ విషయమై అన్ని పార్టీల నాయకులతో సమావేశమై చర్చించారు. ఆ సమయంలో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇన్నీ చర్యలు తీసుకున్నా కరోనా వైరస్‌ అదుపులోకి రాకపోవడంతో చివరకు గత్యంతరం లేక లాక్‌డౌన్‌ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం( Maharashtra government) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం నుంచి మే 1వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రోజుకు అర లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.


Also read: Chardham yatra: చార్‌థామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చవద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook