మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయఘడ్  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబేనలి ఘాట్‌లో పొలందపూర్ దగ్గర ప్రవేట్ బస్సు 500 అడుగుల లోతు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 33 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదం సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి పోలీసులు, స్థానికులు చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


బస్సు అదుపుతప్పి 500 అడుగుల లోయలో పడటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఘటనాస్థలి నుంచి 30 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. మృతులంతా దపోలి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సిబ్బందిగా గుర్తించారు. వీరంతా మహాబలేశ్వర్‌ విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.