Maharashtra: సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదార్ పూణావాలా లండన్ ఎందుకు వెళ్లారు..ఎవరు ఆయన్ని బెదిరించారు..కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు సఖ్యత లేదా..మహారాష్ట్ర మంత్రి ఏం చెబుతున్నారో వినండి మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో రెండే రెండు కంపెనీల వ్యాక్సినేషన్ జరుగుతోంది. భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన మేకిన్ ఇన్ ఇండియా కోవ్యాగ్జిన్ (Covaxin) ఒకటైతే, రెండవది సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్. అయితే సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute) అధినేత అదార్ పూణావాలా దాదాపు నెల రోజుల క్రితం ఇండియా వదిలి బ్రిటన్ వెళ్లిపోయారు. వ్యాక్సిన్ విషయంలో బెదిరింపులు వస్తున్నాయని..అందుకే లండన్ వెళ్లిపోతున్నట్టు స్వయంగా ట్వీట్ కూడా చేశారు. మరోవైపు జెడ్ కేటగరీ భద్రత కల్పించాలని న్యాయస్థానానికి విన్నవించారు కూడా. 


ఇంతకీ ఆయనను బెదిరించింది ఎవరనేది మాత్రం తెలియలేదు. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ఎన్సీపీకు చెందిన మంత్రి హసన్ ముష్రిఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి, గట్టిగా నిలదీయడం వల్లనే భయపడి అదార్ పూణావాలా (Adar Poonawalla) లండన్ వెళ్లిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. జూన్ నెలలో మహారాష్ట్ర ప్రభుత్వానికి 1.5 కోట్ల వ్యాక్సిన్ ఇస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ హామీ ఇచ్చిందని..అయితే కేంద్రం (Central government)హెచ్చరికతో వెనుకంజ వేసిందని మంత్రి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో(Maharashtra government) మీ డీల్ ఏంటని కేంద్ర ప్రభుత్వం..అదార్ పూణావాలాను గట్టిగా నిలదీసిందని మంత్రి హసన్ ముష్రిఫ్ ఆరోపించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఎక్కువగా కావాలంటూ పవర్ ఫుల్ వ్యక్తుల్నించి ఫోన్ కాల్స్ వచ్చాయని అదార్ పూణావాలా స్వయంగా వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీ క్లిష్టమైనదని..రాత్రికి రాత్రి ఉత్పత్తి పెంచడం సాధ్యం కాదని కూడా ఆయన చెప్పారు. 


Also read: NMDC JOBS: నిరుద్యోగులకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీలో ఉద్యోగాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook