Mumbai Police: మన దేశంలో 75 వ రిపబ్లిక్ వేడుకలకు అన్నిరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో పాటు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హజరయ్యేందుకు గాను ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మన దేశానికి చేరుకొనున్నారు. ఇదిలా ఉండగా.. మహరాష్ట్ర లో ఫిబ్రవరి 6 వరకు 144 సెక్షన్  విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరాఠా రిజర్వేషన్ కార్యకర్త మనోజ్ జరాంగే జనవరి 26 నుండి ముంబైలో తన వేలాది మంది మద్దతుదారులతో భారీ నిరసనను నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ముంబైలో 144 సెక్షన్ విధించారు.  సెక్షన్ 144లో భాగంగా, ముంబై పోలీసులు ఫిబ్రవరి 6 వరకు నగరంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం,  ఊరేగింపులు జరపడాన్ని నిషేధించారు.


Read Also: Viral news: ''వామ్మో... ఇదేం పైత్యంరా నాయన".. బాలుడిని గంగా నదిలో ముంచిన మేనత్త.. కారణం తెలిస్తే షాకవుతారు..


ముంబైలో సెక్షన్ 144 కింద ఆంక్షలివే..


ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పెద్దగా గుమిగూడడం నిషేధించబడింది. ఏదైనా ర్యాలీని చేపట్టడం లేదా నిర్వహించడం నిషేధించబడింది. ఈ సమయంలో పటాకులు పేల్చడానికి అనుమతి లేదు. ముంబైలో లౌడ్ స్పీకర్ల వాడకం కూడా నిషేధించబడింది. ఊరేగింపులో మ్యూజిక్ బ్యాండ్‌లను ఉపయోగించడం కూడా నిషేధించబడింది. సెక్షన్ 144 కింద నిరసనలు/నిరాహారదీక్షలు కూడా నిషేధించబడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో తుపాకీ లేదా కత్తిని తీసుకెళ్లడం సెక్షన్ 144 ప్రకారం అనుమతించబడదు


మనోజ్ జారేంజ్ ఎవరంటే..?


గతంలో మరాఠాలందరూ కలిసి కుంబీ (ఇతర వెనుకబడిన తరగతుల కులం) కులానికి చెందిన సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేయడంతో మనోజ్ జరాంగే భారీ నిరసనకు ప్లాన్ చేస్తున్నారు. మరాఠా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరంగే పాటిల్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం 4వ రోజుకు చేరుకుంది.  పూణేలోని రంజన్‌గావ్ నుండి ముంబై వైపు తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తానని చెప్పారు.


Read Also: Republic Day 2024: భారత దేశ గణతంత్ర వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్..


ముంబైలో 144 సెక్షన్ ఎందుకు విధించారు?


మరాఠా రిజర్వేషన్ నిరసన కారణంగా శాంతి భద్రతలకు విఘాతం, విఘాతం, ప్రాణ, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) సెక్షన్ 144 విధించి, ప్రజలు గుమిగూడడం, ఊరేగింపులపై సంబంధిత సెక్షన్ల కింద నిషేధం విధించినట్లు సమాచారం. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook