Maharashtra Deaths: రాష్ట్రంలో తీవ్ర విషాదం, 48 గంటల్లో 31 మంది మృతి
Maharashtra Deaths: మహారాష్ట్రలో అత్యంత విషాదం చోటుచేసుకుంది. సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు పోతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maharashtra Deaths: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర విషాదానికి వరుసగా ప్రాణాలు పోతున్నాయి. గత 48 గంటల వ్యవధిలో 31 మంది మరణించగా అందులో 12 మంది నవజాత శిశువులుండటం కలచివేస్తోంది. అసలేం జరుగుతోంది..
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైద్య ఉదాసీనత ఫలితంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 31 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా శంకర్‌రావు చావన్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘోరమిది. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో 24 గంటల్లో 24 మంది మృత్యువాత పడ్డారు. అందులో 12 మంది నవజాత శిశువులు కావడం గమనార్హం. గత 48 గంటల వ్యవధిలో ఏకంగా 31 మంది మరణించారు. మరోవైపు నాందేడ్ ఆసుపత్రిలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది.
రోగులకు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. మరణించిన 12 మంది నవజాత శిశువుల్లో ఆరుగురు బాలికలు కాగా ఆరుగురు బాలురు ఉన్నారు. చనిపోయిన మిగిలినవారిలో పాము కాటుతో ఆసుపత్రిలో చేరి వైద్య సహాయం అందక ప్రాణాలు పోగొట్టుకున్నవారున్నారు.
చుట్టుపక్కల 70-80 కిలోమీటర్ల దూరంలో ఇదొక్కడ ఏకైక హెల్త్ కేర్ సెంటర్ కావడం వల్ల చాలా సమస్యగా మారుతోందని, అందుకే మందుల కొరత ఏర్పడిందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. వాస్తవానికి హాఫ్‌కిన్ సంస్థ నుంచి మందులు కొనుగోలు చేయాల్సి ఉంటే..అది జరగకపోవడంతో స్థానిక మందుల షాపుల్నించి రోగులో కొనుగోలు చేసుకుంటున్నారు. దాంతో ఆలస్యమై రోగులు మరణిస్తున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి మహారాష్ట్రలోని షిండే వర్గ శివసేన, బీజేపీ, ఎన్సీపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాగా ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది.
Also read: Ap High Court: ఈ నెల 10న లోకేశ్ విచారణకు హాజరుకావల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook