Nashik Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం.. గంట వ్యవధిలో మూడుసార్లు...
Nashik Earthquake Updates: మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది.
Nashik Earthquake Updates: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంగళవారం (ఆగస్టు 16) రాత్రి 8.58గం. సమయంలో, 9.34 గం. సమయంలో, 9.42 గం. సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4, 2.1, 1.9గా నమోదైంది. దిండోరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
దిండోరి గ్రామానికి 16-20 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నాసిక్ జిల్లా అధికారులు గుర్తించారు. దిండోరితో పాటు మడ్కిజంబ్, హత్నూర్, నీల్‌వాండి, జంబుట్కే, ఉమ్రాలే, తలేగావ్, గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు. మిగతా గ్రామాలతో పోలిస్తే జంబుట్కే గ్రామంలో భారీ ప్రకంపనలు సంభవించాయని స్థానిక శివసేన నేత విఠల్ రావ్ వెల్లడించారు.
ప్రజలెవరూ భయభ్రాంతులకు గురికావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. భూకంపంపై పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేశారు. భూకంపం సంభవించిందా అని కొందరు ఆరా తీయగా.. సంభవించింది అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
Also Read: Godavari Floods: మళ్లీ ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, భద్రాచలంలో మూడవ ప్రమాద హెచ్చరిక
Also Read: Horoscope Today August 17th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల పంట పండినట్లే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook