Maharashtra 3000 corona positive cases| దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్ధికవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోన్న ఈ ప్రాణాంతక వైరస్‌ నుంచి అధిక నష్టాన్ని చవిచూస్తున్నది మహారాష్ట్ర ప్రజలు. తాజాగా గురువారం మరో 165 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తద్వారా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3000 దాటిపోయింది. దేశ వ్యాప్తంగా 12వేల కరోనా కేసులుండగా, కేవలం ఒక్క మహారాష్ట్రలో దాదాపు 25శాతం కరోనా బాధితులు నమోదు కావడం విషాదకరం. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ముంబైలో 107, పుణేలో 19, నాగ్‌పూర్‌లో 10 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర వైద్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా బారిన పడి 187 మంది చనిపోయారు. చికిత్స అనంతరం కోలుకుని 295 మంది డిశ్ఛార్జ్‌ అయ్యారు.  లాక్‌డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే


కాగా, భారత్‌లో మొత్తం కరోనా కేసులు 12,380కి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకూ కరోనా కాటుకు 414 మంది బలైపోయారు. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం 1488 మంది కోలుకున్నారని అధికారులు వివరించారు. కరోనాను అరికట్టేందుకు చైనా నుంచి 3 లోల యాంటీబాడీ టెస్టింగ్‌ కిట్లు సహా 6.8లక్షల మెడికల్‌ కిట్లను దిగుమతి చేసుకున్నామని విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో తేలిపింది. బీ అలర్ట్: తెలంగాణలో Red Zones ఇవే..


మహరాష్ట్రలో 11 జిల్లాలను హాట్ స్పాట్ రెడ్ జోన్లుగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ముంబై, పుణే, థానే, నాగ్‌పూర్, సంగ్లి,అహ్మద్ నగర్, యవత్మల్, ఔరంగాబాద్, బుల్ధానా, ముంబై సబర్బన్, నాసిక్ జిల్లాలను రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నాయని పేర్కొంది. వీటికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos