బీ అలర్ట్: తెలంగాణలో Red Zones, HotSpots ఇవే..

దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను ప్రమాదకర హాట్ స్పాట్ ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో తెలంగాణ నుంచి 8 జిల్లాలను (Telangana hotspots Red Zones)  ఆ జాబితాలో పొందుపరిచారు.

Updated: Apr 16, 2020, 10:01 AM IST
బీ అలర్ట్: తెలంగాణలో Red Zones, HotSpots ఇవే..
Image Credit: Google.com

 కరోనా కేసుల తీవ్రతను ఆధారంగా చేసుకుని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హాట్ స్పాట్, నాన్ హాట్ స్పాట్ జిల్లాలను  గుర్తించింది. దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను ప్రమాదకర హాట్ స్పాట్ ప్రాంతాలుగా, 207 జిల్లాలను నాన్ హాట్ స్పాట్ ప్రాంతాలు అని ఇక్కడ కరోనా ప్రభావం లేదని అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా ఉండే ప్రాంతాలను హాట్‌స్పాట్ ప్రాంతాలుగా గుర్తిస్తున్నారని తెలిసిందే.  షాకింగ్: ఏపీలో హాట్‌స్పాట్ కేంద్రాలుగా 11 జిల్లాలు

అంతకుముందు అన్ని రాష్ట్రాల సంబంధిత శాఖ కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని కరోనా కేసులు, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం రెడ్ జోన్, హాట్ స్పాట్ కేంద్రాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకూ కమ్యూనిటి ట్రాన్స్‌మిషన్ జరగలేదని, అంతగా భయపడాల్సిన పని లేదని సూచించారు. ఈ స్పాట్ హాట్ జోన్ ప్రాంతాలకు మార్గదర్శకాలను సైతం వైద్యశాఖనే వెల్లడించనుంది హోంమంత్రిత్వ శాఖ ఇదివరకే తెలిపింది. లాక్‌డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే

హాట్ స్పాట్ జోన్లను రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని మూడు రకాల జోన్లుగా విభజించారు. రెండు వారాలపాటు ఒక్క కేసు కూడా నమోదుకాని రెడ్ జోన్‌ను ఆరెంజ్‌గా ప్రకటిస్తారు. అదే విధంగా 14రోజులపాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్‌గా మారుతుందని అధికారులు తెలిపారు. రెడ్ జోన్ పరిధిలో ఉండే ఏరియా గ్రీన్ జోన్‌కు మారాలంటే కనీసం 4వారాలు పడుతుంది.   ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు

తెలంగాణలో హాట్ స్పాట్ జిల్లాలు ఇవే: రాష్ట్రంలో 8 జిల్లాలను కేంద్ర ఆరోగ్యశాఖ హాట్‌స్పాట్ ప్రాంతాలుగా ప్రకటించింది. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చెల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో కరోనా ప్రభావం ఉండటంతో వీటిని హాట్‌స్పాట్ జిల్లాలుగా గుర్తించారు. 47 జిల్లాలను కలిపి ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేయగా.. తెలంగాణ నుంచి నల్గొండ జిల్లాను చేర్చారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos