Maharashtra Corona Cases: దేశంలో కరోనా మూడో వేవ్ లో మహమ్మారి ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది. కరోనా హాట్​స్పాట్​ రాష్ట్రం అయిన మహారాష్ట్రలో ఆందోళనకర స్థాయిలో కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 46,723 మందికి పాజిటివ్​ కేసులు తేలాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కరోనా ధాటికి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా 28,041 మంది కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా యాక్టివ్​ కేసుల సంఖ్య 2,40,122కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 1367కు చేరింది.


దేశంలోని కరోనా కేసులు


దేశవ్యాప్తంగా బుధవారం 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ కారణంగా మరో 442 మంది మరణించారు. మరోవైపు 60,405 మంది వైరస్​ను జయించారు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


ఒమిక్రాన్​ కేసులుదేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  


Also Read: Corona in India: ముంబయిలో తగ్గిన కరోనా కేసులు- ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రత


Also Read: ISRO New Chairman Somanath: ఇస్రో నూతన ఛైర్మన్‌గా సోమనాథ్‌ నియామకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook