Girls Fight Over Boyfriend: బస్టాండ్‌లో రచ్చ... అందరూ చూస్తుండగా బాయ్‌ఫ్రెండ్ కోసం కొట్టుకున్న బాలికలు..
Girls Fight Over Boyfriend: ఒక అబ్బాయి కోసం ఇద్దరు బాలికలు బస్టాండ్‌లో అందరూ చూస్తుండగా ఒకరినొకరు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు.
Girls Fight Over Boyfriend: మహారాష్ట్రలోని ఓ బస్టాండ్‌లో ఇద్దరు బాలికలు రచ్చ చేశారు. బాయ్‌ఫ్రెండ్ కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే ఒకరినొకరు తిట్టుకుంటూ కలబడ్డారు. ఇదంతా చూసి ఆ బాయ్‌ఫ్రెండ్ భయపడిపోయాడు. ఆ ఇద్దరూ కొట్టుకుంటుండగానే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పైతాన్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బస్టాండ్‌లో గొడవకు దిగిన ఆ ఇద్దరు బాలికల వయసు 17 ఏళ్లు ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒక బాలిక ఓ అబ్బాయితో కలిసి పైతాన్ బస్టాండ్‌కి వచ్చింది. ఈ విషయం తెలిసి వెంటనే మరో బాలిక అక్కడికి చేరుకుంది. నా బాయ్‌ఫ్రెండ్‌తో నీకేం పని అంటూ అతనితో ఉన్న బాలికను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునేదాకా వెళ్లింది.
బస్టాండ్‌లో ప్రయాణికులంతా చూస్తున్నా.. అదేమీ పట్టనట్లు ఒకరినొకరు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు. బాలికల ఫైట్‌తో బిత్తరపోయిన బాయ్‌ఫ్రెండ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికి బస్టాండ్ సిబ్బంది ఆ ఇద్దరు బాలికలను శాంతింపజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా అక్కడ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కొద్దిరోజుల క్రితం రాజస్తాన్‌లోని జైపూర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక బాలిక కోసం ఇద్దరబ్బాయిలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గతంలోనూ పలుచోట్ల ఇలాంటి సంఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.
Also Read: Chiranjeevi: రెండు, మూడు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చిరంజీవి... కారణమిదే..
Also Read: September 2022 Movie Releases: ఏకంగా 17 సినిమాలు రిలీజ్.. లిస్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook