September 2022 Movie Releases: ఏకంగా 17 సినిమాలు రిలీజ్.. లిస్టు ఇదే!

September 2022 Telugu Movie Releases: సెప్టెంబర్ నెలలో ఏకంగా 17 సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ లిస్టు మీ కోసం

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2022, 07:55 AM IST
September 2022 Movie Releases: ఏకంగా 17 సినిమాలు రిలీజ్.. లిస్టు ఇదే!

September 2022 Telugu Movie Releases: సెప్టెంబర్ నెలలో చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ రెండో తేదీన విడుదలవుతోంది. అలాగే అనుదీప్ కేవీ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా కూడా సెప్టెంబర్ రెండో తేదీన విడుదలవుతుంది. ఇవి కాకుండా ఆకాశ వీధుల్లో అనే సినిమా కూడా అదే రోజున విడుదలవుతోంది. ఈ సినిమాలన్నింటిలో కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది. ఇక ఆకాశ వీధుల్లో అనే సినిమా విడుదలవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు.

సెప్టెంబర్ 9వ తేదీన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో నాగార్జున నటించడం,  సౌత్ లో రాజమౌళి విడుదల చేస్తూ ఉండడంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచాల్సింది పోయి ఇదేంటి ఇలా ఉంది అని అనుమానాలు కలిగించేలా చేసింది చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. ఇక అదే రోజు శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం అనే సినిమా కూడా విడుదలవుతోంది. ఈ సినిమా మీద కూడా అసలు ఏ మాత్రం బజ్ లేదు. ఇంకా అదే రోజున విడుదలవుతున్న కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా మీద కాస్త అంచనాలు ఏర్పడ్డాయి.

సత్యదేవ్-తమన్నాల గుర్తుందా శీతాకాలం సినిమా విడుదలవుతున్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఇక అదే రోజున విడుదలవుతున్న అందరూ కొత్త వాళ్లతో చేసిన కొత్త కొత్తగా అనే ట్రైలర్ మాత్రం కాస్త ఆసక్తి ఏర్పరచుకుంది. ఇక విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ విడుదలవుతోంది. సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలు అనే సినిమా కూడా 16వ తేదీ విడుదలవుతుంది.

అదే రోజున నివేదా థామస్, రెజీనా కసాండ్రా నటించిన షాకినీ డాకిని సినిమా కూడా విడుదలవుతోంది. ఇవి కాకుండా క్రేజీ ఫెలో అనే మరో సినిమా కూడా విడుదలవుతోంది. తర్వాత 23వ తేదీన నాగశౌర్య, కృష్ణవరింద విహారి, శ్రీ విష్ణు అల్లూరి అలాగే దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ సినిమాల గురించి అయితే ఏమాత్రం బజ్ లేదు. అదేవిధంగా రవితేజ రావణాసుర, తమిళ బాహుబలి అని భావిస్తున్న పొన్నియన్ సెల్వన్ వన్ సినిమాలు కూడా సెప్టెంబర్ 30వ తేదీ విడుదలవుతున్నాయి ఇందులో రావణాసుర సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

Also Read: Gross, Net and Share Collections: గ్రాస్, నెట్, షేర్ వసూళ్లకు తేడా ఏంటో తెలుసా?

Also Read: Mike Tyson on Liger: లైగర్ సినిమాలో నేనా.. నాకు ఏం తెలియదు! దాని గురించి చెప్పండి: మైక్ టైసన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News