Anand Mahindra: అగ్నివీరులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగమిస్తామన్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra On Agnipath: ఆర్మీ రిక్రూట్ మెంట్ నియామకాల కోసం కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై స్పందించారు
Anand Mahindra On Agnipath: ఆర్మీ రిక్రూట్ మెంట్ నియామకాల కోసం కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అగ్నిపథ్ స్కీమ్ ను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందించే మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై స్పందించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
అగ్నిపథ్ స్కీమ్ ను స్వాగతించిన ఆనంద్ మహీంద్రా.. అగ్నివీరులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఉద్యోగ అవకాశం కల్పిస్తుందన్నారు. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువతను రిక్రూట్ చేసుకోవడానికి మహీంద్రా గ్రూప్ సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అగ్నివీరులు నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యం వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయన్నారు ఆనంద్ మహీంద్రా. అగ్నివీరులకు కార్పోరేట్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. నాయకత్వ లక్షణాలు, ఫిజికల్ ట్రైనింగ్ వాళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు.
అగ్నిపథ్ పై ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఇకపై ఆర్మీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ఉండదని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. అగ్నిపథ్ ద్వారానే ఇకపై నియామకాలు ఉంటాయని తేల్చి చెప్పారు. అగ్నివీరుల కోసం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముద్ర లోన్ స్కీమ్, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాలు అగ్నివీర్లకు అందిస్తామని తెలిపారు. మరోవైపు విపక్షాలు మాత్రం ఉద్యమం ఆపడం లేదు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం కొన్ని సంస్థలు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. దీంతో బీహార్, హర్యానా, పంజాబ్ తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
Also read:Agnipath: అగ్నిపథ్ ద్వారానే ఆర్మీ రిక్రూట్‌మెంట్..కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..!
Also read:Teacher dance with Students: విద్యార్థినులతో కలిసి టీచరమ్మ స్టెప్పులు..సోషల్ మీడియాలో వైరల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook