Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఏరులై పారిన రక్తం, 22 మంది జవాన్లు అదృశ్యం
Encounter: దండకారణ్యం దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు , మావోయిస్టుల కాల్పులతో భీకర వాతావరణం నెలకొంది. రెండు వైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. 22 మంది జవాన్లు అదృశ్యం కావడం ఆందోళన కల్గిస్తోంది.
Encounter: దండకారణ్యం దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు , మావోయిస్టుల కాల్పులతో భీకర వాతావరణం నెలకొంది. రెండు వైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. 22 మంది జవాన్లు అదృశ్యం కావడం ఆందోళన కల్గిస్తోంది.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ( Chhattisgarh forest) మరోసారి రక్తం ఏరులై పారింది. నక్సలైట్లు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మద్య జరిగిన భీకరమైన కాల్పులతో దండకారణ్యం అంతా దద్దరిల్లిపోయింది. ఏప్రిల్ 3వ తేదీ అంటే శనివారం మద్యాహ్నం ప్రారంభమైన భారీ ఎన్‌కౌంటర్ (Major Encounter)లో ఇప్పటి వరకూ 15 మంది జవాన్లు మృతి చెందగా..30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అటు ఓ మహిళా మావోయిస్టుతో పాటు 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇవాళ కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో 22 మంది జవాన్లు ( 22 Jawans missing) అదృశ్యమయ్యారనే విషయం కలకలం కల్గిస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఎదురుకాల్పుల్లో మరణించిన జవాన్లలో కోబ్రా దళానికి చెందిన ఒకరు, ఎస్టీఎఫ్ దళానికి చెందిన ఇద్దరు, డీఆర్డీ విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లున్నారని పోలీసు శాఖ ఇప్పటికే వెల్లడించింది. గాయపడిన జవాన్లను హెలీకాప్టర్ల ద్వారా రాయ్‌పూర్, బీజాపూర్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో 760 మంది జవాన్లు ఉన్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit shah) వివరాలు అడిగి తెలుసుకున్నారు. జవాన్ల మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
Also read: Maharashtra: మహారాష్ట్రలో ప్రమాదకరంగా మారిన పరిస్థితి, 24 గంటల్లో 50 వేల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook