Rakhi: గట్టి దెబ్బే తగిలింది, 4 వేల కోట్ల నష్టం
భారతదేశంలో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి అన్నివిధాలా చేటు తెస్తోంది. టిక్ టాక్ నిషేధం ( TikTok Ban ) తో తగిలిన దెబ్బ నుంచి కోలుకోకముందే ఇప్పుడు రాఖీల రూపంలో భారీ నష్టమే ఎదురైంది. ఏకంగా 4 వేల కోట్ల నష్టం వాటిల్లింది ఆ దేశానికి.
భారతదేశంలో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి అన్నివిధాలా చేటు తెస్తోంది. టిక్‌టాక్ నిషేధం ( TikTok Ban ) తో తగిలిన దెబ్బ నుంచి కోలుకోకముందే ఇప్పుడు రాఖీల రూపంలో భారీ నష్టమే ఎదురైంది. ఏకంగా 4 వేల కోట్ల నష్టం వాటిల్లింది ఆ దేశానికి.
రాఖీ వస్తుందంటే చాలు మార్కెట్ అంతా విభిన్నరకాల రాఖీలతో కళకళలాడుతుంది. వీటిలో అధికశాతం చైనా తయరీ ( China Made Rakhis ) నే ఉంటాయి. ప్రతియేటా చైనా రాఖీల వ్యాపారం వేలకోట్లు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇండియా చైనా సరిహద్దు ఘర్షణ ( Indo china border dispute ) నేపధ్యంలో చైనా వస్తువుల్ని బహిష్కరించాలనే ( Boycott china goods ) వాదన ప్రారంభమైంది. ఇప్పటికే దేశ భద్రత కారణంగా చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్‌లను ఇండియా నిషేధించింది. ప్రతియేటా రాఖీ ( Rakhi ) సందర్బంగా 6 వేల కోట్ల విలువైన 50 కోట్ల రాఖీలు ఇండియాకు వస్తుండేవి. ఈసారి హిందూస్తాన్ రాఖీగా నిర్వహించుకోవాలనే వాదన ఎక్కువైంది. ముఖ్యంగా చైనా వస్తువుల్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారంతా. ముఖ్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( Confederation of All india traders ) కూడా పిలుపిచ్చింది. దాంతో ఈసారి రాఖీలు ఇండియాలోనే తయారయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున విభిన్న డిజైన్లతో రాఖీలు తయారు చేసి మార్కెట్ చేశారు. చైనా నుంచి ఒక్క రాఖీ కూడా ఈసారి దిగుమతి చేసుకోలేదని వ్యాపారసంఘాలు చెబుతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా రాఖీల కారణంగా చైనాకు ఈసారి భారీ నష్టం కలిగింది. ఏకంగా 4 వేల కోట్ల రూపాయల నష్టం ఒక్క రాఖీల్నించే కల్గిందని తెలుస్తోంది. చైనా వస్తువుల్ని పూర్తిగా బహిష్కరించడం సాధ్యం కాదనే వాదన తప్పని రాఖీల ద్వారా నిరూపితమైంది. Also read: MP High Court: రాఖీ కడితేనే బెయిల్ మంజూరు