ఎస్సీ, ఎస్టీలను ఫోన్ లో దూషించినా నేరమే అని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. కులం పేరుతో దూషిస్తే గరిష్టంగా 5 ఏళ్లు జైలు శిక్ష ఖయమని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఓ బహిరంగ స్థలంలో ఉండి.. ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కులం పేరుతో దూషిస్తే అది నేరపూరిత చర్య కిందకు వస్తుందని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. యుపిలో భూ వివాదానికి సంబంధించి.. ఒక వ్యక్తి ఎస్సీ/ఎస్టీ మహిళను ఫోన్లో కులం పేరుతో అవమానించాడు. దాంతో పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదైంది. సదరు వ్యక్తి కేసు కొట్టేయాలని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు నిరాకరించింది. చివరకు అతను సుప్రీంకోర్టులో అప్పీల్ చేసాడు.


కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులో జోక్యానికి నిరాకరించింది. మహిళను నా క్లయింట్ బహిరంగ ప్రదేశంలో దూషించలేదని.. ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉన్నారని, వారి మాటలు వ్యక్తిగతమైనవని, అందుచేత బహిరంగంగా మాట్లాడినట్లు భావించరాదని నిందితుడి తరపు న్యాయవాది వాదించాడు. అయితే సుప్రీం ధర్మాసనం ఆ లాయర్ వాదనతో ఏకీభవించలేదు.