ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ. ..  జోరుగా దూసుకు వెళ్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు తొలి ఫలితం వెలువడలేదు. కానీ . .  ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో దేశంలో అందరి కంటే ముందుగా ఢిల్లీ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం దిశగా సాగిపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు. అంతే కాదు ఎప్పటికీ అభివృద్ధికి మాత్రమే ప్రజలు పట్టం కడతామని మరోసారి నిరూపించారని తెలిపారు. caa, nrc లాంటి చట్టాలను ప్రజలు పట్టించుకోలేదని  చెప్పారు.  
 


అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీ అభివృద్ధి చెందిందని మమతా బెనర్జీ అన్నారు. రానున్న ఐదేళ్లలో ప్రజలకు మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు దీదీ సూచించారు.