Mamata Banerjee: జాతీయ రాజకీయాల్లో మరో వివాదం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ ఛానల్‌కు కాషాయ రంగు మారడంతో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖంగుతిన్నారు. చానల్‌ రంగు మారడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: DK Shiva kumar: ఓటుకు నీళ్లు ఆఫర్.. డీకే శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..


ప్రభుత్వ యాజమాన్యంలో ప్రసార భారతి కొనసాగుతున్న విషయ తెలిసిందే. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో చానల్‌ రంగు మారింది. దూరదర్శన్‌ లోగో రూబీ రెడ్‌ నుంచి కాషాయ రంగుకు మారింది. ఛానల్‌ రంగు మారడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. పార్టీ రంగును ప్రభుత్వ చానల్‌కు అద్దడాన్ని ప్రశ్నిస్తున్నారు. 'చానల్‌ రంగు మారడం చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యా. ఇది పూర్తిగా అనైతికం, చట్టవిరుద్ధం' అని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Also Read: Arvind Kejriwal Mangoes: బెయిల్‌ కోసం మామిడిపండ్లు, స్వీట్లు తింటూ కేజ్రీవాల్‌ డ్రామా.. ఈడీ సంచలన ఆరోపణలు


'దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వ చానల్‌ రంగు మారడం విస్మయానికి గురి చేసింది. ప్రజలు ఎన్నికల్లో బిజీగా ఉన్న సమయంలో దూరదర్శన్‌ లోగో రంగు మార్చడాన్ని ఎన్నికల సంఘం ఎలా అనుమతి ఇచ్చింది? వెంటనే దూరదర్శన్‌ లోగో రంగును పాత రంగులోకి మార్చాలి. కాషాయ రంగుకు బీజేపీతో సంబంధం ఉందని.. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U



ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter