ఎన్డీయేకి వ్యతిరేకంగా మమత బలప్రదర్శన ర్యాలీ; చంద్రబాబు హాజరు..కేసీఆర్ గైర్హాజరు
ఏపీ సీఎ చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలో ఎన్టీయే వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు మమత నడుంబిగించారు
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏన్డీయేతర పక్షాలను ఏకం చేసేందుకు మమత బెనర్టీ నడుంబిగించారు. ఈ నేపథ్యంలో ఎన్టీయే విధానాలకు వ్యతిరేకంగా కోల్ కతాలోని బ్రెగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో బల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబుతో సహా మొత్తం 20 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
హాజరైన పార్టీ చీఫ్ లు వీరే..
మమత నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో పాల్గొనేందుకు కొన్ని పార్టీల అధినేతలు స్వయంగా రాగా..మరికొన్ని పార్టీలు తమ ప్రతినిధులను పంపించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్, నేషనల్ కాన్షరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే అధినేత స్టాలిన్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.
హారజైన పార్టీ ప్రతినిధులు వీరే..
కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే, జేడీఎస్ నుంచి దేవేగౌడ, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్ తదితరులు హాజరయ్యారు. వీరితో ఈన్యాన్య రాష్టరాలకు చెందిన పలు పార్టీల ప్రతినిధులు, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ షౌరీ..బీజేపీ అసంతప్త నేత శత్రుఘ్న సిన్హా, పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సహా 20 పార్టీల నేతలు హాజయ్యారు.
చంద్రబాబు హాజరు.. కేసీఆర్ గైర్హాజరు
ఇటు తెలగాణంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అటు ఏపీలో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులను కూడ గడుతున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు కోల్ కతా వెళ్లి మమత బెనర్జీని కలిసిన విషయం తెలిసిందే. మమత కూడా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బలప్రదర్శనకు దిగడం జరిగింది. అయితే భేటీలో చంద్రబాబు హాజరుకావడం..తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయంగా మారింది. తెలంగాణ అసెబ్లీ సమావేశాల జరుగున్న నేపధ్యంలో కేసీఆర్ దీనికి హాజరుకాలేకపోయారని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.