Man Commits Suicide over Chicken Kebab: భార్య చేసిన 'చికెన్ కబాబ్' టేస్టీగా లేదని ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడో భర్త. ఆపై తాను ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని బన్నేర్‌ఘట్టలో గత వారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బన్నేర్‌ఘట్టకు చెందిన సురేష్ (48), శాలిని (42) ఓ గార్మెంట్ షాపులో పనిచేస్తున్నారు. రోజూ లాగే గత మంగళవారం కూడా పనికి వెళ్లి వచ్చారు. రాత్రి 7గం. సమయంలో ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. కాసేపటికి సురేష్.. తనకు చికెన్ కబాబ్ తినాలనుందని, ప్రిపేర్ చేయమని భార్యతో చెప్పాడు. సురేష్ చెప్పినట్లే భార్య చికెన్ కబాబ్స్ ప్రిపేర్ చేసింది. 


అయితే కబాబ్స్ టేస్టీగా లేవనే కారణంతో సురేష్ రెచ్చిపోయాడు. తీవ్ర కోపోద్రిక్తుడై శాలినిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో ఆమె తల, చేతులు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. శాలిని కేకలకు ఇరుగు పొరుగు అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇంతలో సురేష్ అక్కడినుంచి పరారయ్యాడు.


ఈ ఘటన జరిగిన మరుసటిరోజే సురేష్ తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. భార్యపై అనవసరంగా దాడి చేశాననే పశ్చాత్తపంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 


Also Read: Munugodu ByElection: మునుగోడుకు ఉపఎన్నిక ఖాయం.. యాదాద్రి సభలో బీజేపీ నేతల సంకేతం.. ఆ రోజునే కోమటిరెడ్డి రాజీనామా?


Also Read: Rare Seen: ఇది కలయా.. నిజమా! ఒకే వేదికపైకి జగన్, కేసీఆర్, చంద్రబాబు..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook