Rare Seen: ఇది కలయా.. నిజమా! ఒకే వేదికపైకి జగన్, కేసీఆర్, చంద్రబాబు..

Rare Seen: తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంటాయి. తెలంగాణతో  పోలిస్తే ఏపీలో మరీ దారుణంగా ఉంటుంది పార్టీ నేతల తీరు. ఎదురపడినప్పుడు కనీసం పలకరించుకోవటానికి కూడా ఆసక్తి చూపించరు. సీఎం జగన్, చంద్రబాబు మధ్య వైరం గురించి ఎంత చెప్పినా తక్కువే

Written by - Srisailam | Last Updated : Aug 2, 2022, 02:46 PM IST
  • ఆగస్టు 6న ఢిల్లీలో మీటింగ్
  • జగన్, కేసీఆర్, బాబుకు ఆహ్వానం
  • ఒకే వేదికపై కనిపించనున్న నేతలు
 Rare Seen: ఇది కలయా.. నిజమా! ఒకే వేదికపైకి జగన్, కేసీఆర్, చంద్రబాబు..

Rare Seen: తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంటాయి. తెలంగాణతో  పోలిస్తే ఏపీలో మరీ దారుణంగా ఉంటుంది పార్టీ నేతల తీరు. ఎదురపడినప్పుడు కనీసం పలకరించుకోవటానికి కూడా ఆసక్తి చూపించరు. సీఎం జగన్, చంద్రబాబు మధ్య వైరం గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కాని రాష్ట్ర విభజన తర్వాత సీన్ మారిపోయింది. ఏపీలో అధికార, విపక్ష అధినేతలు ఒకే వేదిక పంచుకోవడం మానేశారు. అసెంబ్లీలో తప్ప ఎక్కడా ఎదురుపడటం లేదు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మాత్రం పరిస్థితి కాస్త వేరుగా ఉంది.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ అధినేత చంద్రబాబుతో గ్యాప్ ఉంది. 2009లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వివాదం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. 2019 ఏపీ ఎన్నికల సమయంలో బహిరంగంగానే చంద్రబాబును వ్యతిరేకంగా మాట్లాడారు కేసీఆర్. చంద్రబాబును ఓడించేందుకు జగన్ కు మద్దతు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టాకా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు జగన్. ఇటీవల కాలంలో జగన్, కేసీఆర్ మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని ముగ్గురు కీలక నేతలు జగన్, కేసీఆర్, చంద్రబాబు మధ్య సఖ్యత లేదన్నది తెలుస్తోంది. అయితే తాజాగా ఓ కీలక పరిణామం జరగబోతోంది. ఈ ముగ్గురు నేతలు ఒకే వేదక పంచుకోబోతున్నారు. అవును మీరు చదివింది నిజమే. జగన్, కేసీఆర్, చంద్రబాబు ఒకే సమావేశంలో పాల్గొనబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారనున్న ఈ అరుదైన సన్నివేశానికి దేశ రాజధాని ఢిల్లీ వేదిక కాబోతోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావడంతో కేంద్ర సర్కార్ ఘనంగా ఉత్సవాలు చేస్తోంది.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఏడాది మొత్తం వేడకలు జరుపుతోంది. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా వైభవంగా సంబరాలు చేయబోతోంది. అన్ని రాష్ట్రాలను ఇందులో భాగస్వామ్యం చేస్తోంది మోడీ సర్కార్. ఇందులో భాగంగా ఈనెల 6న ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌ నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జరగనున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లోక్ సభ స్పీకర్, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, దేశంలోని సీనియర్ రాజకీయ నేతలు, ప్రముఖులను ఆహ్వానించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల నిర్వహణపై చర్చించనుంది. ఈ సమావేశానికి రావాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది.

దేశానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమం కావడంతో అందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే ప్రధాని సమావేశానికి వెళుతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. దీంతో జగన్ వెళ్లడం కూడా ఖాయమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళతారనే తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో జరిగే ప్రధాని మోడీ సమావేశంలో జగన్, కేసీఆర్, చంద్రబాబు వేదిక పంచుకోబోతున్నారు. ఈ ముగ్గురు నేతలు ఒకే వేదికపై కనిపిస్తే చూడాలని  తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే  ఢిల్లీ సమావేశంలోనైనా సరదాగా మాట్లాడుకుంటారా లేక ఎడముఖం పెడ ముఖంగానే ఉంటారా అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. ఒకవేళ కేసీఆర్ వెళ్లకపోయినా.. రాజకీయంగా బద్ద శత్రువులైన జగన్, చంద్రబాబు ఒకే వేదిక పంచుకోవడం మాత్రం ఖాయం.

Also Read: Elachi Remedies for Money: ఇలాచీ పరిహారాలు.. ఇలా చేస్తే డబ్బే డబ్బు, మనీ కష్టాలన్నీ మాయం

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News