ఢిల్లీలోని కేరళ హౌజ్‌లోకి కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ ఆగంతకుడిని గేటు వద్దే ఉన్న భద్రతా బలగాలు పట్టుకున్నాయి. ఆగంతకుడు గట్టిగా అరుస్తూ కేరళ హౌజ్‌లోకి దూసుకొస్తుండటాన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. అదే సమయంలో కేరళ హౌజ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఉండటంతో ఆగంతకుడి చొరబాటు ఘటనకు మరింత ప్రాధాన్యత చేకూరినట్టయింది. ఆగంతకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని ఢిల్లీలోని హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్‌కి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలావుంటే, కేరళ హౌజ్‌లో ఈ ఘటన జరగడానికి కొద్ది గంటల ముందే జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా నివాసం వద్ద సైతం ఇటువంటి ఘటనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎటువంటి మారణాయుధాలు లేకుండానే తన SUV కారులో ఫరూఖ్ అబ్దుల్లా ఇంట్లో చొరబడేందుకు యత్నించిన ఓ ఆగంతకుడిని అక్కడే బందోబస్తులో ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు హతమార్చాయి. (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి