Man writes off crores of rupees worth property to government: ఉత్తరప్రదేశ్‌కి (Uttar Pradesh) చెందిన ఓ వ్యాపారి రూ.2.50కోట్లు విలువ చేస్తే తన ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఆస్తి కోసం (Property disputes) తన కొడుకు పెట్టే పోరు భరించలేక... చివరకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. బతికేందుకు సరిపడా డబ్బు సంపాదించుకున్నానని... మరణానంతరం తన ఇంటిని ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలని కోరుతూ వీలునామా రాశాడు. ఈ మేరకు ఆ కాపీని స్థానిక మెజిస్ట్రేట్‌కు అందజేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వ్యాపారి పేరు గణేశ్ శంకర్ పాండే. ఆగ్రాలో (Agra) నివాసముండే గణేశ్ శంకర్ పాండే పొగాకు వ్యాపారం చేస్తుంటాడు. స్థానికంగా ఆయనకు 250 గజాల ఇల్లు ఉంది. దీని విలువ సుమారు రూ.2.50 కోట్లు. అయితే ఆ ఆస్తిలో తన వాటా తనకివ్వాలని కొన్నాళ్లుగా పెద్ద కొడుకు దిగ్విజయ్ పోరు పెడుతున్నాడు. దీంతో విసిగిపోయిన గణేశ్ శంకర్ పాండే తన ఇంటిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు వీలునామా రాశాడు. ఆ వీలునామా కాపీని స్థానిక మెజిస్ట్రేట్‌కు (Magistrate) అందించాడు.


దీనిపై గణేశ్ శంకర్ పాండే మాట్లాడుతూ...'నా పెద్ద కొడుకు దిగ్విజయ్, అతని భార్య, ఇద్దరి పిల్లలు నాతో పాటే నా ఇంట్లోనే ఉంటున్నారు. ఆస్తిలో వాటా ఇవ్వాలని దిగ్విజయ్ నిరంతరం నాతో పోరు పెడుతున్నాడు. కనీసం నన్ను గౌరవించకపోగా నాతో అమర్యాదగా వ్యవహరిస్తున్నాడు. వ్యాపార బాధ్యతలు చూసుకోవాలని చెప్పినా పట్టించుకోవట్లేదు. ఎంతసేపూ నా ఆస్తిని ఎలా లాక్కోవాలా అని చూస్తున్నాడు. ఇవన్నీ చూశాక ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలాగు నేను బతికేందుకు సరిపోయేంత డబ్బు నావద్ద ఉంది. అందుకే నా ఆస్తిని ప్రభుత్వానికి చెందేలా వీలునామా రాసి... ఆ కాపీని మెజిస్ట్రేట్‌కు (Agra) అందించాను.' అని చెప్పుకొచ్చారు.


Also Read: 83 Trailer Out: కపిల్‌ దేవ్ 83 మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది..భారత అభిమానులకు గూస్ బంప్సే


గణేశ్ పాండే వీలునామాపై మెజిస్ట్రేట్ ప్రతిపాల్ సింగ్ స్పందించారు. ఆయన ప్రభుత్వానికి రాసిచ్చిన ఆస్తి విలువ కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జిల్లా మెజిస్ట్రేట్ (Uttar Pradesh) ప్రభు ఎన్ సింగ్ దీనిపై స్పందిస్తూ... తాము గణేశ్ శంకర్ పాండేతో మాట్లాడినట్లు చెప్పారు. ఆయనకేమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కొడుకుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook