83 Trailer Out: కపిల్‌ దేవ్‌ 83 మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది.. భారత అభిమానులకు గూస్ బంప్సే!!

టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా  తెరకెక్కిన '83' సినిమా చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడులైంది. హీరో రణవీర్ సింగ్ ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. లండన్‌ లార్డ్‌ క్రికెట్‌ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 12:06 PM IST
  • 83 మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది
  • భారత అభిమానులకు గూస్ బంప్సే
  • డిసెంబర్‌ 24న దేశ వ్యాప్తంగా విడుదల
83 Trailer Out: కపిల్‌ దేవ్‌ 83 మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది.. భారత అభిమానులకు గూస్ బంప్సే!!

anveer Singh and Deepika Padukone's 83 trailer is out: ప్రస్తుతం బాలీవుడ్‌లో బ‌యోపిక్స్ హవా నడుస్తోంది. ప్ర‌ముఖుల జీవితం ఆధారంగా రూపొందించే బ‌యోపిక్‌లు బంపర్ హిట్ కొట్టాయి.  ముఖ్యంగా క్రీడాకారులు మిల్కా సింగ్, మేరీ కోమ్, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ జీవిత కథలతో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టాయి. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లు త్వరలో రానున్నాయి. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ (Kapil Dev) జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కింది. కబీర్‌ ఖాన్‌ (Kabir Khan) దర్శకత్వంలో '83' (83 Film) పేరుతో త్వరలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవనున్న '83' సినిమాలో రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకోనే (Deepika Padukone), జీవా, తాహీర్‌ రాజ్‌ భాసీన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీపికా పదుకొనే, కబీర్‌ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్‌ నడియాడ్‌వాలా, ఫాంటమ్‌ ఫిలిమ్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్‌ లిమిటెడ్‌ ఈ సినిమాను నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ఫిల్మ్.. కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్‌ 24న దేశ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. 3డీ వెర్షన్‌లోనూ ఈ సినిమా విదులకానుంది. 

Also Read: Nagini Dance: మైమరచిపోయి పాములు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో చూడండి! Viral Video

'83' సినిమా చిత్ర ట్రైల‌ర్ (83 trailer) తాజాగా విడులైంది. హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'అండర్‌డాగ్‌ టీంగా బరిలోకి దిగి ఊహించని విధంగా విజయం సాధించిన నిజ జీవిత కథ. 83 సినిమా హిందీ వెర్షన్ మీ కోసమే. 3డీ వెర్షన్‌లోనూ సినిమా విడుదల అవనుంది' అని రణవీర్ ట్వీట్ చేశాడు. లండన్‌ లార్డ్‌ క్రికెట్‌ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. 1983 ప్రపంచకప్ (1983 World Cup) విజయంతో ఎండ్ అవుతుంది. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ ఆకట్టుకున్నాడు. 

Also Read: Rape: చాక్లెట్‌కు డబ్బులిస్తానని చెప్పి-నాలుగేళ్ల చిన్నారిపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం

'83' సినిమా చిత్ర ట్రైల‌ర్లో 1983 ప్రపంచకప్ ఎలా సాగిందో చూపించారు. మెగా టోర్నీలో టీమిండియా (Team India) ఎదుర్కొన్న అనుభవాలను కళ్లకుకట్టారు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాలతో పాటు జీవా చేసే కామెడీ కూడా భారత అభిమానులను (Indian Fans) ఆకట్టుకుంటోంది. కొన్ని స‌న్నివేశాలు రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి. ఈ ట్రైల‌ర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. క్రికెట్ ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హర్యానా హరికేన్ కపిల్ దేవ్ భారత్ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన సారథి కూడా అతడే. 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Singh (@ranveersingh)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

More Stories

Trending News