ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్ వెనక్కి తగ్గారు. సొంతపార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ప్రధాని మోడీపై  చేసిన వ్యాఖ్యలపై మణిశంకర్ అయ్యర్‌‌ను కాంగ్రెస్ అధిష్టానం వివరణ కోరింది. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ తన మాతృభాష హిందీ కాకపోవడంతో ఇంగ్లిష్‌ పదాలను హిందీలోకి తర్జుమా చేసే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. 'నీచ్' అనే మాట ద్వారా తాను చెప్పాలనుకున్నది వేరని.. అర్థం అయింది వేరొకటి కాబట్టి క్షమాపణలు చెబుతున్నట్టు చెప్పారు.


గుజరాత్ రెండో విడత ఎన్నికల వేళ ఆయన వ్యాఖ్యలు పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నుండి మణిశంకర్ అయ్యర్‌ను సస్పెండ్ చేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.