Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన ఘర్షణలు.. 15 ఇళ్లకు నిప్పంటించిన అల్లరిమూకలు..
Manipur violence: మణిపూర్ లో మరోసారి ఘర్షణలుు తలెత్తాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంగోల్ గ్రామంలో 15 ఏళ్లకు నిప్పంటించాయి అల్లరిమూకలు.
Manipur violence Update: మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది. అల్లరి మూకలు ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంగోల్ గ్రామంలో 15 ఇళ్లకు నిప్పంటించాయి. అంతేకాకుండా 45 ఏళ్ల వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అతడి ఎడమతొడకు బుల్లెట్ గాయమైంది. ఆ వ్యక్తిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దాంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
నిరసనకారులు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకాన్ లో కూడా మరో మూడు ఇళ్లకు నిప్పంటించారు. మరోవైపు కాంగ్ ఫోక్సి జిల్లాలో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఒక వ్యక్తి నుంచి ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలలుగా ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 150 మంది వరకు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.
మణిపూర్‌లో మరోసారి ఘర్షణలు తలెత్తాయి. శనివారం తెల్లవారుజామున బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ (Kuki) వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి (Houses burnt). మృతులను క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి (Meitei community) చెందినవారని పోలీసులు గుర్తించారు. కొందరు వ్యక్తులు బఫర్ జోన్‌ను దాటి మెయిటీలు ఉండే ప్రాంతాలకు వచ్చి వారిపై కాల్పులకు తెగబడ్డారని వారు తెలిపారు. ఘటనా స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో భద్రతా దళాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఆ ప్రాంతం పూర్తిగా తమ అదుపులో ఉందని అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook