Vande Bharat Express Trains: వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ మరో రెండు వందేభారత్ రైళ్లను కేటాయించింది. ఇందులో ఒకటి తెలంగాణ నుంచి మరొకటి ఏపీ నుంచి కనెక్ట్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీ, తెలంగాణ ప్రజానీకానికి గుడ్‌న్యూస్ . ఒకేసారి రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు రెండు నడుస్తున్నాయి. ఈ రెండు రూట్లలో రైళ్లకు మంచి గిరాకీ ఉంటోంది. ఈ రెండు రైళ్లలో ఆక్సుపెన్సీ రేటు కూడా ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. అందుకే మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించాలని ఇండియన్ రైల్వే యోచిస్తోంది. ఇందులో ఒకటి తెలంగాణ నుంచి కర్ణాటకను కలిపితే మరొకటి ఏపీ నుంచి తమిళనాడును కనెక్ట్ చేసేదిగా ఉంటాయి. ఈ రెండు రైళ్ల కేవలం 8 భోగీలతో నడుస్తూ మినీ వందేభారత్ రైళ్లుగా ఉండవచ్చని తెలుస్తోంది.
తెలంగాణ-కర్ణాటకను కలిపే విధంగా కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య ఒక రైలు, ఏపీ-తమిళనాడు కలిపేలా విజయవాడ-చెన్నై మధ్య మరొకటి ప్రారంభించనుంది రైల్వే శాఖ. ఈ రెండు రైళ్లను ఆగస్టు 15 వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించవచ్చని సమాచారం. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో వందేభారత్ నడిపేందుకు మహబూబ్‌నగర్-డోన్ విభాగంలో ట్రయల్ రన్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ రైలు మౌలాలి లోకోమోటివ్ యార్డ్‌లో ఉంటే..విజయవాడ-చెన్నై రైలు చెన్నైలో ఉంది.
కొత్త వందేభారత్ రైళ్ల టైమింగ్స్ ఇలా
కాచిగూడ-యశ్వంతపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయలుదేరి..మద్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఇదే రైలు తిరిగి మద్యాహ్నం 3 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 11.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఇక విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా విజయవాడలో ఉదయం, చెన్నైలో మద్యాహ్నం బయలుదేరుతుంది. ఈ రెండు రైళ్లకు సంబంధించి స్టేషన్ హాల్ట్‌లపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. విజయవాడ-చెన్నై రైలు రేణిగుంట మీదుగా వెళ్తుంది కాబట్టి తిరుపతికి మరో వందేభారత్ వచ్చినట్టే.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్ జంక్షన్, మహబూబ్‌నగర్, షాద్ నగర్ స్టేషన్లలో ఆగవచ్చు. భవిష్యత్తులో సికింద్రాబాద్-భువనేశ్వర్, సికింద్రాబాద్-పూణే, సికింద్రబాద్-పూణె రూట్స్ పరిశీలనలో ఉన్నాయి.
Also read: Stalin vs Amit Shah: హిందీపై మళ్లీ వివాదం, హిందీకి బానిసలు కాబోమని స్టాలిన్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook