Manipur incident: మణిపూర్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
Manipur incident: మణిపూర్ హింస వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివిధ కేసుల విషయంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Manipur incident: మణిపూర్ అంశంపై సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసింది. బాధితుల పునవారాసం, ఉపశమనం కల్పించే కార్యక్రమాల్ని ఈ కమిటీ పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని పునరుద్ధరించి..ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.
మణిపూర్ అంశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో మాజీ ఛీఫ్ జస్టిస్ గీత మిట్టల్, రిటైర్డ్ జస్టిస్ షాలిని పీ జోషి, జస్టిస్ ఆశా మేనన్ ఉంటారు. మరోవైపు మణిపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి దాఖలైన క్రిమినల్ కేసుల్ని విచారిస్తున్న సిట్ బృందాల్ని పర్యవేక్షించేందుకు మరో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఈ కమిటీలో ఇతర రాష్ట్రాల్నించి డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికార్లను చేర్చుకోవాలని సీబీఐకు సూచించింది. అదే సమయంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్ని పర్యవేక్షించే బాధ్యతల్ని మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయకు అప్పగించింది కోర్టు. మణిపూర్‌కు సంబంధించి మొత్తం 10 కేసుల్ని కోర్టు విచారించింది.
అదే సమయంలో మణిపూర్‌లో హింసను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని రాష్ట్ర డీజీపీ రాజీవ్ సింగ్ కోర్టుకు విన్నవించారు. మరోవైపు మణిపూర్ హింస కేసుల విచారణను కేంద్ర ప్రభుత్వం కూడా పరిణతితో వ్యవహరిస్తోందని ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
Also read: Delhi AIIMS Fire Accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook