Biren Singh Regrets And Said Sorry To Public On Manipur Violence: తాను పరిపాలించే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినందుకు గాను ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరారు. తనను క్షమించాలని కోరుతూ ప్రకటన చేశారు. ఈ వార్త సంచలనంగా మారింది.
Manipur CM: మణిపూర్ రాష్ట్రం మళ్లీ అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు అల్లరిమూకలు ప్రయత్నించడంతో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మణిపూర్ లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమంటున్నారు.
Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది. ఏకంగా ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించడంతో కర్ఫ్యూ విధించారు. భద్రత బలగాలు వారిని అదుపు చేసేందుకు వారిపై భాష్పవాయువును ప్రయోగించారు. సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Manipur Updates: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన మణిపూర్ హింసా ఘటనపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మొయితీ తీవ్రవాద సంస్థలపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Manipur: దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన మణిపూర్ పరిణామాలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. భద్రతా దళాల మొహరింపుతో నివురు గప్పిన నిప్పులా ఉంది. అందుకే ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్పై నిషేధాన్ని మరోసారి పొడిగించారు.
PM Modi Speech Highlights: మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు, విధ్వంసం నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారుపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోదీ.. తన సెటైర్లతో కాంగ్రెస్ పార్టీకి దాదాపు కర్రుకాల్చి వాత పెట్టినంత పనిచేశారు.
Manipur incident: మణిపూర్ హింస వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివిధ కేసుల విషయంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SC on Manipur Viral Video Case: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు అంత జాప్యం జరిగింది అని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు మణిపూర్ పోలీసులపైనా విరుచుకుపడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంత నిర్లక్ష్యం ఎందుకంటూ మణిపూర్ పోలీసుల వైఖరిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.
Manipur Violence: మణిపూర్‌పై సుప్రీంకోర్టు మండిపడింది. దేశం మొత్తం సిగ్గుతో తలదించుకునేలా చేసిన మణిపూర్ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
manipur violence: మణిపూర్‌లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ విచారణ జరపనుంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా మంటలు చల్లారడం లేదు. అన్ని వైపులా నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Supreme Court On Serious on Manipur Video: మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. తామే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అక్కడ మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కోర్టు తెలపాలని ఆదేశించింది.
Manipur Violence Video: మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఓ భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఓ వర్గం.. వారి పట్ల దారుణంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖండించారు.
Manipur Violence: మణిపూర్‌లో హింస ఆగడంలేదు. ఇవాళ తెల్లవారు జామున భారీగా కాల్పులు చోటు చేసుకొన్నాయి. నిన్న ఇండియన్ రిజర్వు బెటాలియన్ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు అల్లరి మూకలు విఫలయత్నం చేశాయి.
Manipur Violence: మణిపూర్‌లో ఎందుకు హింసాకాండ ఆగడం లేదు?. వందలాది మంది చనిపోవడానికి కారణం ఏంటి? అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? జీ న్యూస్ గ్రౌండ్ రిపోర్టులో వెల్లడైన సంచలన విషయాలు.
Manipur Violence News: అమరావతి: మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ విషయమై ఏర్పడిన ఘర్షణలు హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో శాంతి భద్రతల సమస్య తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Manipur Violence News Updates: ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, తెలంగాణకి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్‌తో పాటు అక్కడి పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడం, అనేక జిల్లాల్లో కర్ఫ్యూ వాతావరణం ఉండటంతో ఆ విద్యార్థులు అంతా బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.