Manipur Violence Inside Story:  తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రావణకాష్టంలా మారింది. నెలన్నరోజులుగా హింసతో అట్టడుకుతోంది. గత మే 3వ తేదీన రిజర్వేషన్ విషయంలో మైతీ, కుకీ తెగలు వాగ్వాదానికి దిగాయి. కుకీ కమ్యూనిటీ పర్వత ప్రాంతాలలో నివసిస్తుండగా.. మైతీ తెగలవారు దిగువ ప్రాంతంలో నివశిస్తారు. అయితే మైతీ కమ్యూనిటీకి ఎస్టీ హోదా ఇవ్వటాన్ని కుకీ సామాజిక వర్గం వ్యతిరేకిస్తోంది. దీనికి సంబంధించి మే 3న మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ప్రదర్శన కూడా నిర్వహించారు. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య మెుదలైన హింసాకాండ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణల్లో దాదాపు 100 మందికిపైగా మరణించారు. 50 వేల మందికిపైగా ప్రజలు తమ ఇళ్లను విడిచివెళ్లిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రామంపై అర్ధరాత్రి దుండగులు దాడి
మూడు రోజుల కిందట కుకీ సామాజిక వర్గం ఎక్కువగా నివసించే ఒక గ్రామంపై అర్దరాత్రి దుండగులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా... పది మందికిపైగా గాయపడ్డారు. దాదాపు 300 మంది సాయుధ ఉగ్రవాదులు మయన్మార్ నుండి మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లోకి ప్రవేశించి.. కుకీ జనాభా కలిగిన చురచంద్‌పూర్ వైపు కదులుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. చాలా జిల్లాల్లో ఇప్పటికీ కర్ఫ్యూ అమలులో ఉంది. చెలరేగిన హింసను ఆపడానికి ఆర్మీ మరియు అస్సాం రైఫిల్స్‌కు చెందిన 10,000 మందికి పైగా సైనికులను అక్కడ మోహరించారు. అంతేకాకుండా 7 వేల మందికి పైగా సీఆర్ఫీఎప్ మరియు బీఎస్ఎఫ్ జవాన్లను కూడా రంగంలోకి దింపారు.  


సైన్యం మాట ఏంటి?
కుకీ మిలిటెంట్లు మరియు భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణ ఈ హింసకు కారణమని సీఎం బీరేన్ సింగ్  భావిస్తున్నారు. మరోవైపు మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండకు ఉగ్రవాదంతో సంబంధం లేదని.. రెండు తెగల మధ్య వైరుధ్యమేనని సైన్యం ఇప్పటికే తేల్చి చెప్పింది. 


గ్రౌండ్ రిపోర్టులో ఏం తేలింది?
అసలు విషయం ఏంటని తెలుసుకోవడానికి జీ మీడియా రంగంలోకి దిగింది. కుకీ మరియు మైతి తెగల మధ్య  ద్వేషమే ఈ ఘర్షణలకు కారణమని తెలుసుకుంది. అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. కుకీలు మైతే ఆధిపత్యం ఉన్న ఇంఫాల్‌కు రావడానికి భయపడుతున్నారు. అదే విధంగా మైతే వర్గానికి చెందిన వారు కుకీలు ఉండే ప్రాంతాలకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. పోలీసులు, సైన్యం కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా కుకీ తెగల ప్రజలు ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ మరియు అతని పోలీసులపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే.. మైతేయ్ కమ్యూనిటీ ప్రజలు అస్సాం రైఫిల్స్‌ను నిందిస్తున్నారు.


Also Read: Biperjoy Video: బిపర్‌జోయ్ బీభత్సం, వంతెనను మింగేసిన రాకాసి కెరటాలు, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook