Manipur Violence Video: గత రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇప్పటికే దాదాపు 100 మంది మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు. తాజాగా ఓ భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు కుకీ-జో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి.. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపుతోంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 4న ఈ సంఘటన జరగ్గా.. తాజాగా తెరపైకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియో క్లిప్‌లో భారీ సమూహం ఇద్దరు మహిళలను సామూహిక అత్యాచారం చేయడానికి ముందు నగ్నంగా ఊరేగించారు. నిస్సహాయులైన ఆ మహిళలను ఏడుస్తూ వేడుకుంటున్నా బలవంతంగా తీసుకెళ్లారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వరి పొలాల వెంట తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. తాజాగా వీడియో వైరల్ కావడంతో హింసాత్మక ఘటనలు మరింత పెరిగాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  


ఈ సంఘటనను ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ తీవ్రంగా ఖండించింది. ఇద్దరు మహిళలపై తిరగబడటానికి ముందు గుంపు ఇద్దరు పురుషులను కొట్టి చంపిందని ఇండిజినస్ ట్రైబల్ లీడర్ ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) తెలిపింది. "సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వర్గానికి చెందిన గుంపు ఇద్దరు మహిళలను పొలం దగ్గరకు తీసుకువెళుతున్నట్లు కనిపిస్తోంది. వారిపై గ్యాంగ్ రేప్ కూడా చేశారు. ఈ అమాయక మహిళలు ఎంత భయంకరమైన నరకయాతన అనుభవించారో నేరస్థులు వీడియోల ద్వారా తెలుస్తుంది. నిందితులపై జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ చర్యలు తీసుకోవాలి.." అని ఐటీఎల్‌ఎఫ్‌ విజ్ఞప్తి చేసింది. 


ఈ దారుణ ఘటనను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో మహిళలపై లైంగిక వేధింపుల వీడియోలు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయని అన్నారు. మహిళలపై జరిగిన ఈ దారుణమైన హింసాకాండను అందరూ ఏకతాటిపై వచ్చి ఖండించాలని కోరారు. ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఎందుకు కళ్లు మూసుకుని కూర్చున్నారు..? అని ఫైర్ అయ్యారు. ఇలాంటి వీడియోలు, హింసాత్మక సంఘటనలు వారిని కలవరపెట్టలేదా..? అని ప్రశ్నించారు.  


మణిపూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటంపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. శాంతి ఒక్కటే ముందున్న మార్గం అని ట్వీట్ చేశారు. త్రిపుర పార్టీ అధ్యక్షుడు మోతా ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మా మాట్లాడుతూ.. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఈ ఘటన కలవరపెడుతోందన్నారు. మణిపూర్‌లో ద్వేషం గెలిచిందన్నారు.


Also Read: AP Heavy Rains: పది రోజుల్లో రెండు అల్పపీడనాలు, ఏపీ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక


Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook