Manipur Updates: ఈశాన్య భారతదేశంలోని మణిపూర్‌లో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళన రేపాయి. ఇద్దరు మహిళల్ని వివిస్త్రలు చేసి ఊరేగించిన ఘటన వీడియో అక్కడి పరిస్థితికి అద్దం పట్టింది. ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం రంగంలో దిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మణిపూర్ హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ దర్యాప్తు నిర్వహించింది. రాష్ట్రంలో మొయితీలు, కుకీ తెగల మధ్య పోరాటం శృతి మించి తీవ్రమైన, దారుణమైన హింసాత్మక, అత్యాచార, అరాచకాలకు దారితీసింది. మణిపూర్ హింసాత్మక ఘటనల్లో 178 మంది మరణించగా 50 వేలమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మొయితీ తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. ఈశాన్య ప్రాంతాల్లో  హింసను నివారించే క్రమంలో 9 మొయితీ తీవ్రవాద సంస్థలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద ఐదేళ్ల పాటు నిషేధం విదిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థలు మణిపూర్‌లోని భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులు చేయడమే కాకుండా దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు హానికల్గించే పనుల్లో పాల్గొన్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. 


కేంద్ర హోంశాఖ నిషేధించిన 9 సంస్థల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, దాని  రాజకీయ విభాగం రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, మణిపూర్ పీపుల్స్ ఆర్మీ, పీపుల్స్ రివల్యూషన్ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్, రెడ్ ఆర్మీ, కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ, రెడ్ ఆర్మీ విభాగం, కంగ్లీ యావోల్, కో ఆర్డినేషన్ కమిటీ,  అలయన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ సంస్థలున్నాయి. ఇవాళ్టి నుంచి ఐదేళ్లపాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. సాయుధ పోరాటం ద్వారా మణిపూర్‌ను దేశం నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడమే ఈ సంస్థల లక్ష్యమని కేంద్ర హోంశాఖ తెలిపింది. 


మొయితీ సంస్థలపై వచ్చిన ఆరోపణలు


దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు హాని కల్గించే కార్యక్రమాలు చేపట్టడం, లక్ష్య సాధనకు సాయుధమార్గాన్ని ఎంచుకోవడం, భద్రతా బలగాలు, పోలీసులు, ప్రజలపై దాడులు చేయడం, నిధుల కోసం ప్రజల్ని దోచుకోవడం, విదేశీయులతో సంబంధాలతో వేర్పాటువాద లక్ష్యాలకై ఆయుధ శిక్షణ పొందడం వంటివి గుర్తించారు. 


Also read: Diwali Safety Tips: దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook