Manmohan Singh - Rajya Sabha: మన్మోహన్ సింగ్ సహా రాజ్యసభలో మొత్తంగా 54 మంది పదవీ విరమరణ చేస్తున్నారు. అందులో మన్మోహన్ సింగ్‌తో పాటు 9 మంది సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మరికొందరు ఎగువ సభకు వచ్చే అవకాశాలు లేవు. రాజ్యసభ మెంబర్‌గా మన్మోహన్ సింగ్‌కు 33 యేళ్ల అనుబంధం ఉంది. బహుశా ఎగువ సభతో ఇంత కాలం అనుబంధం ఉన్న నేత మరొకరు లేరనే చెప్పాలి. 1991లో పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి ఉన్న సమయంలో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మన్మోహన్ సింగ్. అప్పటికీ ఆయన ఏ సభలో సభ్యుడు కాదు. దీంతో అదే యేడాది అక్టోబర్‌లో పీవీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఈయన అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నిక అవుతూ వస్తున్నారు. గత పర్యాయం 2019లో రాజస్థాన్ నుంచి ఈయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈయన 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా సేవలు అందించారు.అంతేకాదు దేశానికి అత్యవసరమైన కీలక సంస్కరణలను నాంది పలికారు. అంతేకాదు 1996లో ఈయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత దేశ ప్రధాన మంత్రిగా దేశానికి సేవలు అందించారు.  ఈయన హయాంలో ముంబై బాంబ్ పేలుళ్లు సహా పలు ఉగ్రవాద ఘటనలు దేశంలో ఎక్కువగా చోటుచేసుకోవడం విషాదకరం అనే చెప్పాలి.  నెహ్రూ, ఇందిరా తర్వాత సుధీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేతగా మన్మోహన్ సింగ్ రికార్డు క్రియేట్ చేసారు. మన్మోహన్ సింగ్ ఖాళీ చేసిన రాజస్థాన్ రాజ్యసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫస్ట్ టైమ్ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుతం పాకిస్థాన్‌లో పశ్చిమ పంజాబ్‌లో ఉన్న 'గా'లో జన్మించారు. ఈయన దేశానికి సిక్కు ప్రధాన మంత్రిగా సేవలు అందించారు. 1980 -82లో ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా.. ఆ తర్వాత 1982లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితికి చెందిన కాన్ఫిరెన్స్ ఆఫ్ ట్రేడ్ డెవలప్‌మెంట్‌లో మెంబర్‌గా పనిచేశారు.


మన్మోహన్ సింగ్‌తో పాటు రాజ్యసభ నుంచి నిష్క్రమిస్తున్న కేంద్ర మంత్రుల్లో ధర్మేంద్ర ప్రధాన్ (విద్యా శాఖ), పురుషోత్తం రూపాల (పశు సంవర్ధకం), వి. మురళీధరన్ ( ఎక్స్‌టెర్నల్ ఎఫైర్స్ సహాయ మంత్రి), మన్‌సుఖ్ మాండవీయ (ఆరోగ్యం), నారాయణ రాణే, ఎల్. మురుగన్, అశ్వనీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్‌ల పదవీ కాలం ముగిసింది.ఇందులో అశ్వనీ వైష్ణవ్ మినహా మిగతా 8 మంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అటు సమాజ్ వాదీ పార్టీ నుంచి జయా బచ్చన్‌కు మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసారు.


అటు తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం ముగిసింది. అటు తెలంగాణ నుంచి జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగులు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవీ కాలం నేటితో ముగయనుంది. వీరిలో వద్దిరాజు రవిచంద్ర తిరిగి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.


Also Read: CSK Fan Died: ఐపీఎల్‌లో విషాదం.. రోహిత్‌ శర్మ ఔట్‌పై వివాదం.. సీఎస్కే అభిమాని మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook