Maoist Letter on Dantewada Attack: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు పేలుళ్లలో ఏకంగా 10 మంది పోలీసులు, వాహనం డ్రైవర్‌ ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ఈ ఘటనపై మావోయిస్టులు స్పందించారు. మవోయిస్ట్ పార్టీ దర్బా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినట్లు ఆ పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి సాయినాథ్ పేరుతో లేఖ విడుదల చేశారు. బ్రాహ్మణ హిందుత్వ-ఫాసిస్ట్ కేంద్ర, ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై సాగిస్తున్న అనాగరిక దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ పరాక్రమమైన అరన్‌పూర్ ఎదురుదాడి చేసిన పీఎల్‌జీఏ యోధులకు విప్లవ వందనాలు తెలిపారు.
 
ఏప్రిల్ 26న పీఎల్‌జీఏ అరన్‌పూర్ సమీపంలో  జరిపిన దాడిలో 11 మంది డీఆర్‌జీ గూండాలు మరణించారని లేఖలో పేర్కొన్నారు . ఆ లేఖలో ఏముందంటే.. '2024 లోక్‌సభ ఎన్నికలలోపు మావోయిస్టు పార్టీని అంతమొందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ప్లాన్ ప్రకారం ప్రజలపై యుద్ధం చేస్తున్నారు. బస్తర్ సహజ వనరులను విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని దేశం నిరసిస్తోంది. విప్లవ ఉద్యమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లక్షలాది మిలిటరీ పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ, డీఆర్‌జీ, కోబ్రా వంటి కమాండో బలగాలను మోహరించి బస్తర్‌ను సైనిక కంటోన్మెంట్‌గా మార్చారు. అటువంటి పరిస్థితిలో ఈ దారుణమైన క్రూరమైన దాడులను ప్రతిఘటించడం తప్ప ప్రజలకు వేరే మార్గం లేదు. పేరుమోసిన డీఆర్జీ గూండాలపై దాడిని పీఎల్‌జీఏ అమలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులకు విజ్ఞప్తి..


ఫ్యూడలిజం, దళారీ నౌకర్షా, పెట్టుబడిదారీ  సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మావోయిస్టు పోరాటం ఉంటుంది. ప్రజా శత్రువుల ప్రయోజనాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దీని కోసం మీరు ఒక సాధనంగా ఉపయోగపడుతున్నారు. 2022లోనే గౌతమ్ అదానీ (మోదీ యజమాని) సంపద 40 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనేక రెట్లు పెరిగింది. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పోలీసు శాఖ మినహా మిగిలిన అన్ని విభాగాల్లో నియామకాలను నిలిపివేసింది. ఈ దయనీయ స్థితిలో మీలో చాలామంది ఉన్నత చదువులు చదివినా కుటుంబ పోషణ కోసం బలవంతంగా పోలీసు ఉద్యోగాలకు వెళ్తున్నారు.


Also Read: Bandi Sanjay: పోలింగ్ బాక్స్ బద్దలయ్యేలా బీజేపీకి ఓటేయ్యండి.. కర్ణాటక ఎన్నికల్లో బండి సంజయ్ పిలుపు   


మీ బలవంతాన్ని మేము కూడా అర్థం చేసుకున్నాము. దోపిడీదారులకు సేవ చేయడానికి అణగారిన ప్రజలపై దాడులలో మీరు పాల్గొనవద్దని అభ్యర్థించాము. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ప్రజల పక్షాన మీరు ఉండాలి..' అని మవోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. గౌరవప్రదంగా జీవించాలంటే పోలీసు ఉద్యోగంలో చేరే బదులు ఇతర శాఖల్లో ఉద్యోగాలు చేరాలని యువతకు సూచించారు. బస్తర్ ప్రాంతంలో వైమానిక దాడులు నిలిపివేయాలన్నారు. ప్రభుత్వాల అణచివేత ఎంత పెరిగితే.. ప్రజల నుంచి ప్రతిఘటన అంతగా పెరుగుతుందని హెచ్చరించారు.


దంతేవాడలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ నెల 26న ఉదయం డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్‌ ప్రత్యేక యాంటీ నక్సలైట్‌ టీమ్‌ కూబింగ్ నిర్వహించారు. అయితే ఆ ఆపరేషన్‌ను ముగించుకుని పోలీసులు తిరిగి ప్రయాణం అయ్యారు. ముందే ప్లాన్ వేసిన మవోయిస్టులు.. ఐఈడీతో దాడి చేసి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేశారు. ఈ ఘటనలో వ్యాన్‌ డ్రైవర్ సహా మరో 10 మంది పోలీసులు అక్కడికికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


Also Read: Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook