Maoists Kill Couple who left camp to get married : ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో మావోయిస్టులు సొంత క్యాడర్‌‌నే అంతమొందించుకుంటున్నారు. కనికరం లేకుండా అరాచకాలు సృష్టిస్తున్నారు. వివాహం చేసుకుని పార్టీని వీడాలి అనుకున్న ఓ ప్రేమ జంటను చంపేశారు. బస్తర్‌ రేంజ్‌ ఐజీపీ సుందర్‌రాజ్‌ పాటిలింగం తెలిపిన వివరాల మేరకు.. బీజాపూర్‌ డిస్ట్రిక్ట్‌లో మావోయిస్టు పార్టీ (Maoist party) మిలీషియా ప్లాటూన్‌ కమాండర్‌ కమ్లు పూనెం, సభ్యురాలు మంగి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారి ఇద్దరూ పెళ్లి (Marriage) చేసుకోవాలన్నారు. దీంతో పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో మావోయిస్ట్‌ క్యాంపు నుంచి (Maoist camp) వారు పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే సొంత క్యాడర్ వారు అని కనికరం కూడా చూడకుండా మావోయిస్టులు వారిని అడ్డుకుని చంపేశారు. ఇక అదేరోజు గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ (Police Station) పరిధిలో కూడా ఇంకో వ్యక్తిని హత్య చేశారని ఐజీ చెప్పారు. 


Also Read : Vanama raghava arrest : పాల్వంచ‌ రామ‌కృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పురోగతి.. మూడు రోజులకు దొరికిన వ‌న‌మా రాఘ‌వ


ఇక.. చర్ల మావోయిస్టు ఎల్‌ఓఎస్‌, ఎల్జీఎస్‌ కమాండెంట్లు మధు, రాజేశ్‌, డీసీఎస్‌ ఆజాద్‌.. అమాయక ఆదివాసీలను ఇన్ఫార్మర్స్‌ అనే నెపంతో చంపుతున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem) ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. మావోయిస్ట్ పార్టీలోని కొందరు పురుషులు.. మహిళా మావోయిస్టులపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్పీ సునీల్‌దత్‌ (SP Sunil Dutt) వివరించారు. ఇక వారికి ఎదురు తిరిగే అమాయక మహిళలను ఇన్ఫార్మర్లు అనే నెపంతో దారుణంగా హత్య చేస్తున్నారని తెలిపారు.


Also Read : Trisha tests positive for Covid : త్రిషకు కోవిడ్ పాజిటివ్.. వారం రోజులుగా నరకం.. అక్కడ ఇరుక్కపోయిన హీరోయిన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook