Karnataka High Court on Husband Sexual Assualt against wife: వైవాహిక జీవితంలో లైంగిక క్రూరత్వానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యలపై లైంగిక క్రూరత్వానికి వివాహామేమీ లైసెన్స్ కాదని పేర్కొంది. ఆ విషయంలో వివాహం పురుషులకు ప్రత్యేక అధికారం ఏం ఇవ్వలేదని... ఇవ్వదని తెలిపింది. లైంగిక క్రూరత్వానికి పాల్పడే వ్యక్తులు శిక్షార్హులైనప్పుడు.. భర్తలకు కూడా అది వర్తిస్తుందని.. అందుకు వారు కూడా శిక్షార్హులేనని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'పురుషుడు పురుషుడే.. ఒక చర్య చర్యే.. అత్యాచారం అత్యాచారమే.. భార్య అయిన మహిళపై భర్త అయిన పురుషుడి లైంగిక దాడి నేరమే..' అని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. భార్యపై భర్త లైంగిక దాడి ఆమెపై మానసికంగా శారీరకంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. అందుకే చట్టాలను రూపొందించేవారు ఇప్పుడు "నిశ్శబ్ద స్వరాలను వినడం" అత్యవసరమని అభిప్రాయపడింది. ఒక మహిళను పెళ్లి చేసుకున్నంత మాత్రానా.. ఇక ఆమె సర్వస్వంపై తమదే అజమాయిషీ అనే పాత కాలపు ఆలోచనలను పక్కనపెట్టాలని సూచించింది.


దేశంలో ఇప్పటివరకూ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే చట్టమేదీ లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన భర్త తననొక లైంగిక బానిసగా చూస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. తన భర్త తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని.. తన కూతురు ముందు కూడా లైంగిక దాడి చేస్తున్నాడని సదరు మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది.


రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులిద్దరూ సమానమేనని... భర్త అయినంత మాత్రాన అత్యాచార ఆరోపణల నుంచి అతనికి మినహాయింపునివ్వడం అసమానతగానే కాదు, రాజ్యాంగ ఉల్లంఘణ అవుతుందని హైకోర్టు తెలిపింది. కాబట్టి చట్టంలోని అసమానతల గురించి చట్టాలు చేసేవారు ఆలోచించాల్సిన అవసరం ఉందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. 


Also Read: Boycott RRR in Karnataka: 'ఆర్ఆర్ఆర్'కి కన్నడిగుల షాక్... సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook