Hijab Dispute: ఇస్లాంలో హిజాబ్ ధారణ తప్పనిసరి కాదంటున్న హైకోర్టు, సుప్రీంను ఆశ్రయించే యోచనలో విద్యార్ధులు

Hijab Dispute: కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై తుదితీర్ప వెలువడింది. స్కూల్ యూనిఫాం మార్చాల్సిన అవసరం లేదగని..హిజాబ్ ధారణ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 15, 2022, 12:48 PM IST
Hijab Dispute: ఇస్లాంలో హిజాబ్ ధారణ తప్పనిసరి కాదంటున్న హైకోర్టు, సుప్రీంను ఆశ్రయించే యోచనలో విద్యార్ధులు

Hijab Dispute: కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై తుదితీర్ప వెలువడింది. స్కూల్ యూనిఫాం మార్చాల్సిన అవసరం లేదగని..హిజాబ్ ధారణ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించి తరగతులకు హాజరు కావడాన్ని కొన్ని విద్యాలయాలు వ్యతిరేకించాయి. దీంతో ప్రతిఘటన ప్రారంభమైంది. అదే సమయంలో రాష్ట్రంలోని కొప్ప జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా డ్రెస్ కోడ్ వివాదం తలెత్తింది. కాలేజీ క్లాస్‌ రూమ్‌లో ముస్లిం యువతులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు కాషాయ కండువాలతో క్లాసులకు హాజరయ్యారు. ముస్లిం యువతులు హిజాబ్ ధరించడాన్ని అనుమతించినప్పుడు... తాము కాషాయ కండువాలు ధరించడాన్ని కూడా అనుమతించాల్సిందేనని ఆ విద్యార్థులు కాలేజీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఇలా వివాదం పెరిగి పెద్దదైంది. గత కొంత కాలంగా రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. విద్యాసంస్థల వద్ద 144 సెక్షన్ పెట్టేంత వరకు వెళ్లింది వ్యవహారం. విద్యాసంస్థల వద్ద  ప్రభుత్వం కూడా భారీగా భద్రతా బలగాలను మొహరించాల్సి వచ్చింది. దీంతో  సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు వెలువరించింది. తుది తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో పాటించాలని సూచించింది. ఈ అంశంపై తొలుత విచారణ చేపట్టిన జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ ఏకసభ్య ధర్మాసనం.. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకన్నా ముందే తన తుది తీర్పు వెలువడింది. 

ఈ వివాదంపై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన కర్నాటక హైకోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన కాదని హైకోర్టు స్పష్టం చేసింది.  విద్యార్థుల్లో సమానత్వ భావన నెలకొల్పేందుకు పాటిస్తున్న స్కూల్ యూనిఫాం నిబంధనను మార్చాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.  విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ...కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. 

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్‌ కామత్, ప్రభుత్వం పక్షాన ప్రభులింగ్‌ నావడగి వాదనలు వినిపించారు. వీరితో పాటు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్ల తరుపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న కర్ణాటక హైకోర్టు ఇస్లాంలోని పలు అంశాలపై లోతైన చర్చ చేపట్టింది. హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన కాదన్న విషయాన్ని గుర్తించింది. అయితే హైకోర్టు తీర్పుపై కొందరు విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

Also read: Hijab Row: హిజాబ్‌ వివాదం.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు! సర్వత్రా ఉత్కంఠ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News