Record Rainfall : ఈశాన్యంలో కుండపోత వర్షాలు.. చిరపుంచి రికార్డ్ బ్రేక్.. మాసిన్రాంలో 1003.6 మిల్లీమీటర్ల వర్షపాతం!
Record Rainfall :ఈశాన్య భారతదేశంపై వరుణుడు విరుచుకుపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అసోం, మేఘాలయలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. రికార్డ్ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి.
Record Rainfall : ఈశాన్య భారతదేశంపై వరుణుడు విరుచుకుపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అసోం, మేఘాలయలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. రికార్డ్ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. మేఘాలయలోని మవ్‌సిన్‌రామ్ రికార్ఢ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ప్రదేశంగా ఉన్న మవ్ సిన్ రామ్ లో జూన్ నెలకు సంబంధించి 82 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. 1940 తర్వాత జూన్ నెలలో ఒక్క రోజులోనే 1003. 6 మిల్లిమీటర్ల వర్షపాతం మవ్‌సిన్‌రామ్ లో రికార్డైంది. 945.4 మిమీ గత రికార్డును అధిగమించింది.
రెండవ అత్యంత సమీప వర్షపాతం రికార్డు మవ్‌సిన్‌రామ్ సమీపంలోని చిరపుంజిలో ఉంది. చిరపుంజిలో శుక్రవారం 972 మిమీ వర్షపాతం నమోదైంది. గత మూడు రోజులుగా, మేఘాలయలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. తూర్పుఖాసీ హిల్స్ లోని సోహ్రాలో గురువారం 972 మిల్లిమీటర్ల వర్షం పాతం నమోదైంది. 1955 తర్వాత 2022 జూన్ 17న ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ ప్రకటించింది. భారీ వరదలతో సోహ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం బీభత్సం స్పష్ఠించింది.
జూన్ 15 నుండి వరుసగా మూడు రోజులు చిరపుంజిలో భారీ వర్షపాతం నమోదైంది. వరుసగా 811 మిమీ, 673.6 మిమీ మరియు 972 మిమీ వర్షం కురిసింది. చిరపుంజిలో గత మూడు రోజుల్లో 2,456 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది కూడా రికార్డే. వరుసగా మూడు రోజులు రికార్డ్ వర్షం కురవడం గత 122 సంవత్సరాలలో ఇదే తొలిసారని చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం జూన్ 1 నుండి చిరపుంజిలో 4,067 మిమీ వర్షం నమోదైంది.
ఇటీవల కురిసిన వర్షాలకు అస్సోం, మేఘాలయలో అత్యంత ఘోరమైన వరదలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలకు అస్సాంలో పది మంది మరణించారు. ఎడతెరపి లేకుండా కురస్తున్న వానకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అసోంలో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అసోంలోని 25 జిల్లాల్లో వర్షాలు వరదలు కారణంగా 11 లక్షల మందికిపైగా నిరాశ్రులయ్యారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.దేశరాజధాని ఢిల్లీలోనూ వాతావరణం చల్లబడింది. కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు కోల్‌కతాకు ఎంటరయ్యాయి.
Read also: Rain Alert: తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook